Hyderabad: తీన్మార్ మల్లన్నకు షాక్.. డీజీపీకి ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నేతలు..
ABN , Publish Date - Feb 04 , 2025 | 04:38 PM
హైదరాబాద్: తమ కులాన్ని దూషించారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. డీజీపీ జితేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmaar Mallanna)పై రెడ్డి సంఘాల (Reddy Community) నేతలు మండిపడుతున్నారు. తమ కులాన్ని దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 28న వరంగల్ (Warangal) వేదికగా బీసీ సభను తీన్మార్ మల్లన్న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెడ్డి కులంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, కుక్కలతో పోలుస్తూ దూషించారని ఆరోపణలు వస్తున్నాయి. మల్లన్న వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి కులాన్ని కించపరిచేలా దూషించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.
CM Revanth Reddy: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులపై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..
ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ ఉప్పల్ పోలీసులకు రెడ్డి మహిళా సంఘం నేతలు ఫిర్యాదు చేయగా.. నేడు(మంగళవారం) డీజీపీ జితేందర్ రెడ్డిని కలిసిన రెడ్డి సంఘం నేతలు మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీనిపై వెంటనే స్పందించాలని కోరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రెడ్డి కులానికి మల్లన్న క్షమాపణలు చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని రెడ్డి సంఘాల నేతలు తీన్మార్ మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: తెలంగాణ సచివాలయానికి బెదిరింపు కాల్స్.. నిందితుడు ఎవరంటే..
Hyderabad: నార్సింగి పోలీసులను మరోసారి ఆశ్రయించిన నటి లావణ్య.. ఈసారి ఎందుకంటే..