kula Ganana Survey: మరోసారి కుల గణన సర్వే
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:37 PM
Telangana kula Ganana Survey: తెలంగాణలో మళ్లీ కుల గణన సర్వే నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. గత సర్వే సమయంలో పలువురు ఉద్దేశ పూర్వకంగా వివరాలు వెల్లడించలేదన్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కుల గణన సర్వే నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ.. తెలంగాణలో 3.1 శాతం మంది సర్వేలో పాల్గొన లేదని చెప్పారు.
గతంలో నిర్వహించిన సర్వేలో పాల్గొనని వారి కోసమే ఈ సారి నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే కుల గణన సర్వే కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ సర్వేలో వివరాలు వెల్లడించ లేదని మల్లు భట్టి విక్రమార్క వివరించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాష్ట్రంలో బీసీల శాతం స్వల్పంగా తగ్గినట్లు నివేదిక స్ఫష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2014లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో 51 శాతానికి పైగా బీసీలు ఉన్నారని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరిపిన సర్వేలో బీసీల శాతం దాదాపు 5 శాతానికిపైగా తగ్గడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
ఈ నేపథ్యంలో కులగణన సర్వే మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కుల గణన సర్వే మళ్లీ నిర్వహించాలంటూ కేటీఆర్ డిమాండ్‌పై రేవంత్ కేబినెట్‌లోని పలువురు మంత్రులు మండిపడ్డారు. ఆ క్రమంలో కొండ సురేఖ సైతం కేటీఆర్‌కు కాస్తా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కుల గణన సర్వే మళ్లీ నిర్వహించాలంటే.. మీతోపాటు మీ ఫ్యామిలీ దరఖాస్తు చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కొండా సురేఖ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
దేశంలో కుల గణన జరగాలని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే.. తెలంగాణలో కుల గణన సర్వే నిర్వహిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు ఆ పార్టీకి పట్టం కట్టాడు. దాంతో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ కుల గణన సర్వే నిర్వహించింది. ఈ సర్వేపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో మరోసారి కుల గణన సర్వే నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
For Telangana News And Telugu News