Share News

Yadadri: శ్రీరామవతార అలంకారంలో నరసింహుడి దర్శనం

ABN , Publish Date - Jan 12 , 2025 | 08:52 AM

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మూడో రోజు ఆదివారం అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో నరసింహుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం యాదగిరీషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Yadadri: శ్రీరామవతార అలంకారంలో నరసింహుడి దర్శనం

యాదాద్రి: యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహా స్వామి (Lakshmi Narasimha Swamy) ఆలయం (Temple)లో మూడో రోజు ఆదివారం అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార (Sri Rama Avatara) అలంకారంలో నరసింహుడు భక్తులకు దర్శనం (Devotees) ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం యాదగిరీషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు రెండో రోజు శనివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం వేణుగోపాల(కృష్ణాలంకారం) స్వామికి దివ్య ప్రబంధ పారాయణాలు, సాయంత్రం గోవర్ధన గిరిధారి ద్రావిడ ప్రబంధ పారాయణాలను పారాయణికులు పఠిస్తుండగా ప్రధానార్చకులు ప్రధానార్చకులు నల్లందీఘల్‌ లక్ష్మీనరసింహ చార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో ఆలయ ఈవో ఏ. భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్క రాయణీ నరసింహమూర్తి, ఏఈవో నవీన్‌, పర్యవే క్షకులు రాజన్‌బాబు, రామరావు ఉన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

యువతిపై పగబట్టిన కోతి.. కాపాడాలని..


శాస్త్రోక్తంగా నిత్య పూజలు

ఆలయంలో శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరిగాయి. సుప్ర భాతసేవతో గర్భా లయంలో కొలువుదీరిన స్వయంభువులను మేల్కొలిపిన అర్చ కులు ప్రతిష్టామూ ర్తులను వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చించారు. సాయంత్రం ప్రధా నాలయ ముఖ మండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు సహస్ర నామార్చనలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో నిత్య కైంకర్యాలు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. శివాలయంలో పర్వతవర్ధిని సమే తా రామలింగేశ్వరస్వామికి మహామండపంలో స్ఫటికమూర్తులకు నిత్యారా ధనలు, యాగశాలలో నిత్య రుద్రహవన పూజలు శైవాగమ పద్ధతిలో కొన సాగాయి.


యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి..

కాగా శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య 5.28 గంటలకు గరుడ వాహనంపై లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వార దర్శనంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి క్యూలైన్లలో నిలుచున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద బారులు తీరుతున్న వాహనాలు

సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్నారా.. జాగ్రత్త..

ఆ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాక్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 12 , 2025 | 08:52 AM