Share News

Hyderabad: బాబోయ్.. దారుణ ఘటన.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు..

ABN , Publish Date - Jan 06 , 2025 | 06:28 PM

తెలంగాణ: హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. ప్రయాణిస్తున్న కారులో ప్రమాదవశాత్తూ ఇద్దరు సజీవ దహనం అయ్యారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరూ చిక్కుకుపోయారు.

Hyderabad: బాబోయ్.. దారుణ ఘటన.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు..
Car Fire Accident

హైదరాబాద్: నగర శివారు ప్రాంతం ఘట్‌కేసర్‌(Ghatkesar)లో దారుణం జరిగింది. ప్రయాణిస్తున్న కారు(Car Fire Accident)లో ప్రమాదవశాత్తూ ఇద్దరు సజీవ దహనం అయ్యారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో సజీవ దహనం అయ్యారు. కారు నుంచి మంటలు రావడంతో స్థానికులు భారీగా గుమిగూడారు. కారులోని వ్యక్తుల ఆర్తనాదాలు విని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో వాహనం వద్దకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కారులోని ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 06 , 2025 | 09:03 PM