Hyderabad: తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎప్పుడంటే..
ABN , Publish Date - Jan 15 , 2025 | 08:30 PM
సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రానున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు.
ఢిల్లీ: సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రానున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మహేశ్ గౌడ్ వెల్లడించారు. ఇవాళ (బుధవారం) ఏఐసీసీ కేంద్ర కార్యాలయం "ఇందిరా భవన్"(Indira Bhavan) ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి టీపీసీసీ చీఫ్ ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
CPI MLA: ఎమ్మెల్యే కూనంనేనికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
జనవరి నెలాఖరు లోపే తెలంగాణలో నామినేటెడ్, కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులు భర్తీ చేయనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పార్టీ పదవులు దక్కుతాయని టీపీసీసీ చీఫ్ చెప్పారు. అలాగే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, అధిష్ఠానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఇవాళ్టి సమావేశంలో ఢిల్లీ పెద్దలతో చర్చ జరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పని తీరు భేషుగ్గా ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రశంసించారని టీపీసీసీ చీఫ్ చెప్పారు. జీహెచ్‌హెంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మళ్లీ నోటీసులు.. విచారణకు రాలేనన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు