Share News

Turmeric farmers crisis: పసుపు రైతుల పరిస్థితి ఇదీ.. ఆదుకోండి ప్లీజ్

ABN , Publish Date - Mar 15 , 2025 | 11:04 AM

Turmeric farmers crisis: రాష్ట్రంలో పసుపు రైతుల పరిస్థితిపై కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. పసుపు ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.

Turmeric farmers crisis: పసుపు రైతుల పరిస్థితి ఇదీ.. ఆదుకోండి ప్లీజ్
Turmeric farmers crisis Thummala Letter

హైదరాబాద్, మార్చి 15: పసుపు ధరల అంశాన్ని మరోవైపు కేంద్రం (Central Govt) దృష్టికి తీసుకెళ్లారు మంత్రి తుమ్మల నాగేశ్వరరా రావు(Telangana Minister Thummala Nageshwar Rao). పసుపు ధర పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయంటూ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు (Union Minister Shivraj Singh Chouhan) మంత్రి లేఖ రాశారు. రాష్ట్రంలో పసుపు ధరలపై దృష్టి సారించి పసుపు రైతులను (Turmeric farmers) ఆదుకోవాలని తుమ్మల లేఖలో కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (Market Intervention Scheme) కింద పసుపును కొనుగోలు చేయాలని కోరారు.


తుమ్మల లేఖ ఇదే..

ఎన్‌ఏఎఫ్‌ఈడీ ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పసుపు సేకరణ చేయాలనీ కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్‌ను మంత్రి తుమ్మల కోరారు. రాష్ట్రంలో పసుపు సాగు సుమారు 42,093 ఎకరాలు అని.. 1,25,436 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగిందన్నారు. ప్రస్తుతం, పసుపు ధర క్వింటాల్‌కు రూ.17,000 నుంచి రూ.11,000 మధ్య ఉందన్నారు. అయితే ఇది మరింత తగ్గే సూచనలు ఉన్నాయన్నారు. ఇంకా గత సంవత్సరం పసుపు నిల్వలు అమ్ముడుపోలేదని తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో పసుపు ధరల నాణ్యత ఆధారంగా దాదాపు 17% నుంచి 27% వరకు తగ్గాయన్నారు. రైతులను ఆర్థిక నష్టాల నుంచి రక్షించడానికి తక్షణ జోక్యం చేసుకోవాలని వినతి చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు సాగు ఖర్చు ఆధారంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్‌తో ఎన్‌ఏఎఫ్‌ఈడీ ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పసుపును కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలో కోరారు. అంతకు ముందు కూడా కేంద్రమంత్రికి లేఖ రాసిన మంత్రి.. మార్చి నెలలో అధికమొత్తంలో పసుపు పంట మార్కెట్ కు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.


కాగా.. రాష్ట్రంలో పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సీజన్ ప్రారంభం నుంచే సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్న పరిస్థితి. అంతేకాకుండా మార్కెట్‌లో దోపిడీకి అంతేలేకుండా పోయింది. చాలా ఏళ్ల నుంచి పసుపు సాగు చేస్తున్నప్పటికీ ఇల్లాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని రైతులు వాపోతున్నారు. పసుపుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు రోడ్డెక్కి ధర్నాలు కూడా చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని.. పసుపుకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

justice for Viveka: ఆరు ఏళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ

గర్ల్ ఫ్రెండ్‎కి సర్ప్రైజ్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 11:04 AM