Share News

Crime News.. సూర్యాపేట: సైకో భర్తను హతమార్చిన భార్యలు

ABN , Publish Date - Jan 13 , 2025 | 09:32 AM

సూర్యాపేట: జిల్లాలో దారుణం జరిగింది. చివ్వేంల మండలం, గుర్రం తండాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిపై సైకో తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కూతురుతో పాటు తన ఇద్దరు భార్యలను సయితం వేధిస్తున్నాడు. భర్త ఆగడాలు మితిమీరడంతో వేధింపులు తాళలేక సహనం కోల్పోయిన భార్యలు సైకో భర్తను హతమార్చారు.

Crime News.. సూర్యాపేట: సైకో భర్తను హతమార్చిన భార్యలు

సూర్యాపేట: జిల్లాలో దారుణం జరిగింది. చివ్వేంల మండలం, గుర్రం తండాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిపై సైకో తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కూతురుతో పాటు తన ఇద్దరు భార్యలను సయితం వేధిస్తున్నాడు. భర్త ఆగడాలు మితిమీరడంతో వేధింపులు తాళలేక సహనం కోల్పోయిన భార్యలు సైకో భర్తను హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి..

కొంచెం తిని పెంచమ్మా...


రంగారెడ్డి జిల్లా: మణికొండలో కారు బీభత్సం.

ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా, మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. తానేషానగర్‌లో అతివేగంగా, రాంగ్ రూట్‌లో వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను ‌ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తన రూట్‌లో ప్రయాణిస్తున్న మహిళను రాంగ్ రూట్‌లో వచ్చిన కారు ఢీ కొట్టింది. కారు కంట్రోల్ తప్పడంతో డైరెక్టుగా మహిళ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రమాద దృశ్యాలు సిసి టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకుని సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఆన్ లైన్ పెట్టుబడి పేరుతో మోసం...

సంగారెడ్డి: సైబర్ మోసగాళ్ళు ఆన్ లైన్ పెట్టుబడి పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. రూ. 24 లక్షలు మాయం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లెకు చెందిన కాట్రపల్లి దుగ్గిరెడ్డికి పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని సైబర్ మోసగాళ్ళు నమ్మబలికారు. దీంతో ఆ వ్యక్తి విడతల వారిగా వారి ఖాతాల్లో రూ. 24 లక్షలు జమ చేశాడు. చివరకు మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు దుగ్గిరెడ్డి సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు..

కైట్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

అగ్ర రాజ్యం.. అసాధ్యం కాదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 13 , 2025 | 09:32 AM