Arrest: యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న మహిళ అరెస్టు..
ABN , Publish Date - Mar 18 , 2025 | 10:13 AM
సినిమా అవకాశాల పేరుతో యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న నాగరాణి అనే మహిళు పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు, సరూర్ నగర్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. నాగరాణిని దిల్‌సుక్‌నగర్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

హైదరాబాద్: సినిమా అవకాశాల (Movie opportunities) పేరుతో యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న నాగరాణి (Nagarani) అనే మహిళను పోలీసులు అరెస్టు (Police Arrest) చేశారు. ఫిలిం కాస్టింగ్ మేనేజర్ (Film Casting Manager) నంటు ఆమె మోసాలకు పాల్పడుతోంది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఎర వేసి సినిమాల పేరుతో యువతులను ఆకర్షించి విటుల వద్దకు పంపుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వలపన్ని నాగరాణినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు (Human Trafficking Police), సరూర్ నగర్ పోలీసులు (Saroor Nagar Police) డాకాయిట్ ఆపరేషన్ (Dacoit operation) నిర్వహించారు.
Also Read..:
పెనుగంచిప్రోలు తిరుణాలలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు..
డాకాయిట్ ఆపరేషన్..
డాకయిట్ ఆపరేషన్ ద్వారా నాగరాణిని దిల్‌సుక్‌నగర్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతుల ఫోటోలను వాట్సాప్ ద్వారా విటులకు నాగరాణి పంపుతుంది. దాంతో వారు అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటుంది. డబ్బులు వచ్చాక.. లొకేషన్ కన్ఫర్మేషన్ చేస్తున్న తర్వాత నాగరాణి యువతలను స్వయంగా విటులవద్దకు తీసుకువెళుతుంది. బలవుతున్న యువతులు, మహిళలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
పనిలో చేరిన 16 గంటల్లోనే..
మరో ఘటన.. పనిలో చేరిన 16 గంటల్లోనే ఓ ఇంట్లో పని చేస్తున్న మహిళ అదే ఇంట్లో చోరీకి పాల్పడి పరారైంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విశాఖకు చెందిన సత్యనారాయణకు నిందితురాలు శ్రీదేవి పరిచయమైంది. పని కోసం వెతుక్కుంటున్నానని చెప్పడంతో ఆయన తన కుమార్తె ఇంట్లో పనికి కుదిర్చారు. శనివారం రాత్రి శ్రీదేవి బస్సులో వైజాగ్ నుండి బయలుదేరి హైదరాబాద్ వచ్చింది. ఆదివారం ఇంట్లో కలుపుగోలుగా ఉంటూ పనులు చేసిన నిందితురాలు యజమానులు మరో గదిలో ఉండగా రాత్రి 16 గ్రాముల బంగారం పావుకిలో వెండితో ఉడాయించింది. చోరీ జరిగిన విషయం గుర్తించిన బాధితురాలు బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైజాగ్‌లో రిపేరికు ఇచ్చిన మొబైల్ తీసుకోవడానికి వచ్చి అక్కడి పోలీసులకు పట్టుబడింది. విషయం తెలుసుకున్న బోరబండ పోలీసులు శ్రీదేవి కోసం వైజాగ్ వెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Chiranjeevi: లండన్‌లో మెగాస్టార్ చిరంజీవి..
విజయనగరంలో ‘కోర్ట్’ సినీ బృందం సందడి
For More AP News and Telugu News