Share News

Madhu Vulli: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘ఆప్తా’ హస్తం!

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:36 AM

తెలుగు రాష్ట్రాలలో వ్యవస్థాపక వాతావరణం పెంపొందించడంతో పాటుగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్ట్‌పలకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ఽధ్యేయంగా తాము తొలిసారిగా అంతర్జాతీయ వ్యాపార సదస్సును నిర్వహిస్తున్నామని అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసొసియేషన్‌ (ఆప్తా) అధ్యక్షుడు మధు ఉల్లి తెలిపారు.

Madhu Vulli: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘ఆప్తా’ హస్తం!

  • తెలుగువారిని ప్రోత్సహించడమేలక్ష్యంగా క్యాటలిస్ట్‌ గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌

  • అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధుల వెల్లడి

  • హైటెక్స్‌లో వేడుకగా 3 రోజుల సదస్సు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : తెలుగు రాష్ట్రాలలో వ్యవస్థాపక వాతావరణం పెంపొందించడంతో పాటుగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్ట్‌పలకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా తాము తొలిసారిగా అంతర్జాతీయ వ్యాపార సదస్సును నిర్వహిస్తున్నామని అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసొసియేషన్‌ (ఆప్తా) అధ్యక్షుడు మధు ఉల్లి తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరగనున్న ఆప్తా క్యాటలిస్ట్‌- గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ 2025’ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఏపీ మండలి సభ్యుడు బొత్ప సత్యనారాయణ, శాసనసభ సభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ సహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార వర్గాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు.


కనెక్ట్‌, కొలాబరేట్‌, క్రియేట్‌ నేపథ్యంతో మొట్టమొదటిసారిగా ఆప్తా ఈ అంతర్జాతీయ వ్యాపార సదస్సును నిర్వహిస్తుందన్నారు. దాదాపు 42కు పైగా సెషన్లు ఈ సదస్సులో జరుగనున్నాయన్నారు. వీటిలో 100కు పైగా స్పీకర్లు, ప్యానలి్‌స్టలు పాల్గొంటారని, ఆయా రంగాల్లోని వ్యాపారవేత్తలకు తగిన మార్గనిర్ధేశనం చేయడంతో పాటుగా వారికి అవసరమైన నిధులను కూడా అందించడానికి వెంచర్‌ క్యాపిటలి్‌స్టలు కూడా వచ్చారన్నారు. ఈ సదస్సులో భాగంగా స్టార్ట్‌పల కోసమే క్యాటలిస్ట్‌ బిజినెస్‌ పిచ్‌ కాంపిటీషన్‌ (కెబీపీ) సైతం నిర్వహిస్తున్నామన్నారు. దీనికోసం 100కు పైగా దరఖాస్తులు వచ్చాయని, వారిలో నుంచి ఎంపిక చేయబడ్డ 16 స్టార్ట్‌పలు తమ ఆలోచనలను వెంచర్‌ క్యాపటలి్‌స్టల ముందు ప్రదర్శించనున్నారన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 05:36 AM