Justice PS Narasimha: పీవీ సాహితీ వ్యక్తిత్వం గొప్పది
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:03 AM
మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు సాహితీ వ్యక్తిత్వం ఘనమైనదని, ఆయన రాజకీయాల్లో కాకుండా సాహిత్యంలో కొనసాగి ఉంటే ఇంకా గొప్ప రచనలు వచ్చేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ అన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ
న్యూఢిల్లీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు సాహితీ వ్యక్తిత్వం ఘనమైనదని, ఆయన రాజకీయాల్లో కాకుండా సాహిత్యంలో కొనసాగి ఉంటే ఇంకా గొప్ప రచనలు వచ్చేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ అన్నారు. ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు పీవీ సాహిత్య జీవితంపై తాను రచించిన పుస్తకాన్ని సోమవారం తనకు బహూకరించిన సందర్భంగా జస్టిస్ నరసింహ ఈమేరకు వ్యాఖ్యానించారు. పీవీ సాహిత్య జీవితంపై కేంద్ర సాహిత్య అకాడమీ పుస్తకాన్ని ప్రచురించినందుకు ఆయన అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు, రచయిత కృష్ణారావును అభినందించారు.