అభివృద్ధి పనులకు పెద్దపీట
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:28 AM
కాంగ్రెస్ ప్రభు త్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్ప డిన 15 నెలల్లోనే 10 కోట్ల రూపాయలతో మండలాన్ని అన్ని విఽధాల అభివృద్ది చేశామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు.
ధర్మారం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభు త్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్ప డిన 15 నెలల్లోనే 10 కోట్ల రూపాయలతో మండలాన్ని అన్ని విఽధాల అభివృద్ది చేశామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాచరిక పాలన చేసి పేద ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. వారి పాలనలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి సిద్ధం గా ఉన్నామని హామీ ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా 4 కోట్లు, ఎస్.సి సబ్ ప్లాన్ ద్వారా 1.98 కోట్లు, సీఆర్ ఆర్ ద్వారా 4 కోట్లు, కలెక్టర్ స్పెషల్ ఫండ్ కింద 2.96 కోట్లతో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. సిఆర్‌ఆర్ నిధులతో మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు, ఖిలావన పర్తి పోచమ్మ గుడి దగ్గర వాగు పై కల్వర్ట్ నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. గత పాలకులు పొలా లకు నీళ్ళు ఇవ్వకుండా వారి స్వార్థం కోసం సిద్దిపేట, హైదరాబాద్ తరలించారని ఆక్రోశం వ్యక్తం చేశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి రైతుల చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ సీజన్ చివరి దశలో పంట పొలాలకు నీళ్లు అందడం లేదని రైతులు తెలుపగా వెంటనే ఎస్‌ఆర్‌ఎస్‌పి ఆధికారులతో మాట్లాడి నీళ్లు ఇచ్చామని తెలిపారు. ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మెన్ అరిగె లింగయ్య, పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, బ్లాక్-2 అధ్యక్షులు కోమ టిరెడ్డి రవీందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కొడారి హన్మయ్య, కాడే సూర్య నారాయణ, దేవి జనార్దన్, కొత్త నర్సింహులు, అజయ్, పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ప్రభుత్వ విప్ విమర్శించారు. ధర్మపురి నియోజక వర్గం అభివృద్ధి చెందలేదని, అప్పటి నాయకుడు 50 ఏళ్శ ప్రస్థానం పేరుతో పుస్తకం రాయించుకోవడం సంతోషకరమే గాని, అదే పుస్తకంలో ధర్మపురి నియోజకవర్గానికి ఏం చేశారో రాసి ఉంటే బాగుండేదని పరోక్షంగా విమర్శించారు.