Share News

దరఖాస్తులు కుప్పలు తెప్పలు

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:48 PM

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకవచ్చిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం అధికారులకు కత్తి మీద సాములా మారను న్నది. జిల్లా వ్యాప్తంగా ఆయా కార్పొరేషన్ల పరిధిలో స్వయం ఉపాధి కోసం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువ తీ, యువకులు దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తులు కుప్పలు తెప్పలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకవచ్చిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం అధికారులకు కత్తి మీద సాములా మారను న్నది. జిల్లా వ్యాప్తంగా ఆయా కార్పొరేషన్ల పరిధిలో స్వయం ఉపాధి కోసం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువ తీ, యువకులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు ప్రభుత్వం విధించిన గడువు ముగిసే నాటికి మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో 42,640 దరఖాస్తులు రాగా, ఆఫ్‌లైన్‌లో కూడా కొందరు మున్సి పల్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలు పొందేందుకు 9,318 మంది ఎస్సీలు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 942 మంది ఎస్టీలు, బీసీ కార్పొరే షన్‌ ద్వారా రుణాలు పొందేందుకు 28,871 మంది, ఈబీసీ కార్పొరేషన్‌ ద్వారా 825 ఈబీసీలు, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 2,615 మంది మైనార్టీలు, క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ ద్వారా 69 మంది క్రిస్టియన్లు దరఖాస్తు చేసుకున్నారు.

నాలుగు కేటగిరీల ద్వారా యూనిట్లు మంజూరు

రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు గాను నాలుగు కేటగిరీల్లో ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. 50 వేల రూపాయల వరకు గల యూనిట్‌కు 100 శాతం సబ్సిడీ, లక్ష రూపాయల వరకు గల యూనిట్‌కు 90 శాతం సబ్సిడీ, 2 లక్షల రూపాయల వరకు గల యూనిట్‌కు 80 శాతం, 4 లక్షల రూపాయల వరకు గల యూనిట్లకు 70 శాతం సబ్సిడీ అందజేయనున్నారు. చాలా మంది 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు గల యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖా స్తులన్నింటినీ మండల, మున్సిపల్‌ అధికారులు కార్పొరేషన్లు, కేటగిరీల వారీగా వేరు చేస్తున్నారు. వాట న్నింటినీ వేరు చేసిన తర్వాత ఈ నెలాఖరు వరకు అర్హులను గుర్తించాల్సి ఉంటుంది. మే 15 వరకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోనూ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సమైన జూన్‌ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. అదే రోజున కొన్ని యూనిట్లను గ్రౌండింగ్‌ చేసి దుకాణాలను ఆరంభించనున్నారు.

నేతల చుట్టూ ప్రదక్షిణలు..

రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుదారులు ఆయా కార్పొరేషన్ల ద్వారా లబ్ధి పొందేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. పథకం కింద మంజూరు చేయించాలని గ్రామ, మం డల, జిల్లా స్థాయి నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక జాబితాపై జిల్లా ఇన్‌చార్జీ మంత్రి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. దాదాపు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన తుది జాబితా ప్రకారమే యూనిట్లు మంజూరు కానున్నాయి. దీంతో ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలపై తీవ్రంగా ఒత్తిడి పెరగుతు న్నది. ప్రభుత్వం జిల్లాలకు లక్ష్యాలు విధించక పోవ డంతో ఎంత మందికి లబ్ధి చేకూర్చేలా యూనిట్లు మంజూరు చేస్తుందనే విషయం తెలియడం లేదు. ఒకటి, రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగ నుండడంతో తమను ఆశ్రయించిన వారిందరికీ పథకం మంజూరు చేయించాల్సిన అవసరం ఏర్పడింది. తాము ప్రతిపాదించిన వారికి యూనిట్లు మంజూరు కాకుంటే తమ పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు. అలాగే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయడం కత్తిమీద సాములా మారనున్నది.

Updated Date - Apr 19 , 2025 | 11:48 PM