అన్ని భూములకు భూధార్ కార్డ్
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:31 PM
ఆధార్ కార్డు లాగానే ప్రతీ భూమికి భూధార్ కార్డు ప్రభుత్వం తీసుకు వస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం మేడారం రైతువేదికలో ఏర్పాటు చేసిన భూ భారతిపై అవగాహన సదస్సులో కొత్త ఆర్‌ఓఆర్ చట్టంపై ప్రజలకు వివరించారు. ధరణి పోర్టల్‌లో లేని పలు అంశాలు భూ భారతిలో ప్రభుత్వం పొందు పరచిందని పేర్కొ న్నారు.
ధర్మారం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఆధార్ కార్డు లాగానే ప్రతీ భూమికి భూధార్ కార్డు ప్రభుత్వం తీసుకు వస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం మేడారం రైతువేదికలో ఏర్పాటు చేసిన భూ భారతిపై అవగాహన సదస్సులో కొత్త ఆర్‌ఓఆర్ చట్టంపై ప్రజలకు వివరించారు. ధరణి పోర్టల్‌లో లేని పలు అంశాలు భూ భారతిలో ప్రభుత్వం పొందు పరచిందని పేర్కొ న్నారు. భూ భారతిలోని రికార్డుల్లో తప్పుల సవరణ, భూముల రిజిష్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వ భూముల మ్యుటెషన్, సాదా బైనామాల క్రమబద్దీక రణ, పట్టదారు పాసుబుక్కులు పొందడం వంటి కీలక అంశాలు ప్రజలకు వివరించారు. ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారి అనుమానాలను నివృత్తి చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ధరణిలో సమస్యలు పరిష్కారం కాక రైతులు కోర్టు చుట్టూ తిరగాల్సి ఉండేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రేస్ ప్రభుత్వం పని చేస్తుందని, సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా పాలనను రూపొందిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు పునాది లేవల్ వరకు పూర్తయిన బంజేరుపల్లి గ్రామానికి చెందిన పులిపాక మల్లమ్మకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. అదనపు కలె క్టర్ వేణు, ఆర్‌డీఓ బొద్దుల గంగయ్య, తహసీల్దార్ ఎండీ వఖీల్, ఆర్.ఐలు వరలక్ష్మి, నవీన్, ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లా నాయక్, వైస్ చైర్మెన్ అరిగె లింగయ్య, నాయకులు కొడారి హన్మయ్య, కాడే సూర్యనారాయణ బొల్లి స్వామి, దేవి జనార్దన్, కొత్త నర్సింహులు, కాంపెల్లి రాజేశం పాల్గొన్నారు.