Share News

రైతుల ప్రయోజనం కోసమే భూభారతి

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:34 PM

రైతుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం విద్యావనరుల కేంద్రంలో భూభారతిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్‌ వేణుతో కలిసి పాల్గొ న్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకు వచ్చిన భూభారతి చట్టంలో కీలక అంశాలను పొందుపరిచి రైతులకు మేలుచేసే విధంగా రూపొందించారన్నారు.

రైతుల ప్రయోజనం కోసమే భూభారతి

ఎలిగేడు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రైతుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం విద్యావనరుల కేంద్రంలో భూభారతిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్‌ వేణుతో కలిసి పాల్గొ న్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకు వచ్చిన భూభారతి చట్టంలో కీలక అంశాలను పొందుపరిచి రైతులకు మేలుచేసే విధంగా రూపొందించారన్నారు. భూమి హక్కుల రికార్డుల్లో తప్పులు, రిజిస్త్రేషన్‌ చేయడానికి ముందు సర్వే మ్యాప్‌, భూముల మ్యూటేషన్‌ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేస్తారన్నారు.

అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం, జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల, ధాన్యం కొనుగోలు కేంద్రం, లాలపల్లిలో ఉపాధిహామీ పనులు, ఎంపీపీ ఎస్‌ పాఠశాల, నర్సాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్‌ పరి శీలించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కలెక్టర్‌ మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనుల పురోగతి వివరాలు తెలుసు కున్నారు. వేసవి దృష్ట్యా ఉపాఽధిహామీ పనుల ప్రదేశాలలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సుల్తాన్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాలలో పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయురాలు వావిలాల సంధ్యరెడ్డిని కలెక్టర్‌ సత్కరించారు. ఎలిగేడు, నర్సాపూర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్‌ ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ సూచించారు. నాణ్యత ప్రమాణాలు, తేమశాతం ఉన్న ధాన్యాన్ని కొను గోలు చేసి రైస్‌మిల్లులకు తరలించాలని, వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేం దర్‌, డియం శ్రీకాంత్‌, తహసీల్దార్‌ బషీరోద్ధీన్‌, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంపీవో కిరణ్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌ రెడ్డి, ఏపీఎం సుధాకర్‌, ఏఓ ఉమాపతి, ఎంఈఓ నరేంద్రచారి పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:35 PM