బీజేపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:57 PM
బీజేపీ సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. గురువారం బీజేపీ రామగుండం ఇన్‌చార్జి కందుల సంధ్యా రాణి ఆధ్వర్యంలో గావ్ చలో... బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని కూరగాయల మార్కెట్‌తో పాటు జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి పరిసర ప్రాంతాల్లో శుభ్రపరిచారు.
కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): బీజేపీ సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. గురువారం బీజేపీ రామగుండం ఇన్‌చార్జి కందుల సంధ్యా రాణి ఆధ్వర్యంలో గావ్ చలో... బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని కూరగాయల మార్కెట్‌తో పాటు జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి పరిసర ప్రాంతాల్లో శుభ్రపరిచారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ పథకంలో భాగంగా అనేక కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారని, చిరు వ్యాపా రులు దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్థంబమని, వారిని బలంగా నిలబెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తెలంగాణలో కాషా యం జెండా ఎగురుతుందన్నారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. బీజేపీ నాయకులు మేరుగు హన్మంతుగౌడ్, కోడూరి రమేష్, భూమయ్య, కోమళ్ల మహేష్, పిడుగు కృష్ణ, జక్కుల నరహరి, కుమారస్వామి, రవీందర్‌రెడ్డి, వీరేశం పాల్గొన్నారు.
నేడు సహపంక్తి భోజనాలు
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గ్రామగ్రామాన సభలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలతో సహ పంక్తి భోజనాలు చేసే కార్యక్రమం చేపట్టామని బీజేపీ జిల్లా అధ్య క్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. సుభాష్‌నగర్‌లో సహపంక్తి భోజన కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ లబ్ధిదారుల ఇండ్లలో సహపంక్తి భోజనాలు చేస్తున్నామన్నారు. నాయకులు కడారి అశోక్ రావు, సౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, కూకట్ల నాగరాజు, కోట నాగేశ్వర్, ఎల్లంకి రాజు, ఎనగందుల ఎల్లయ్య మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.