Share News

అలంకారప్రాయంగా రైతువేదికలు

ABN , Publish Date - Feb 28 , 2025 | 12:09 AM

లక్షలు వెచ్చించి నిర్మించిన రైతువేదికలు అలంకార ప్రాయంగా మారాయి. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సౌకర్యం లేక అలంకారప్రాయంగా మిగిలాయి.ఊరికి దూరంగా నిర్మించడంతో కొన్ని రైతు వేదికలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి.

అలంకారప్రాయంగా రైతువేదికలు

పాలకుర్తి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): లక్షలు వెచ్చించి నిర్మించిన రైతువేదికలు అలంకార ప్రాయంగా మారాయి. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సౌకర్యం లేక అలంకారప్రాయంగా మిగిలాయి.ఊరికి దూరంగా నిర్మించడంతో కొన్ని రైతు వేదికలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. పాలకుర్తి మండలంలోని మూడు రైతువేదికల పరిస్థితిపై ప్రత్యేక కథనం.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షలు వెచ్చించి రైతువేదికలను నిర్మించింది. వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉండేందుకు, సమకాలీన సాగు అంశాలపై ఎప్పటికప్పుడు రైతులతో సమావేశమయ్యేందకు వీలుగా రైతువేదికలను ఏర్పాటుచేశారు. అయితే ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఎల్కలపల్లి, జయ్యారం, కుక్కలగూడూర్‌ పేరిట మండలంలో మూడు క్లస్టర్లు మంజూరయ్యాయి. జయ్యారం, ఎల్కలపల్లిలో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో పుట్నూర్‌, పాలకుర్తిలో, కుక్కలగూడూర్‌లో రైతువేదికలు నిర్మించారు. మూడు రైతువేదికకు ప్రహరి పూర్తి కాలేదు. గుత్తేదారులు నాసిరకంగా పనులు చేపట్టడంతో పగుళ్లు చూపుతున్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేదు. కుర్చీలు, బల్లలు, బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. కానీ నీటి వసతి కల్పించలేదు. గ్రామాలకు దూరంగా ఉండడంతో ఆయా పంచాయతీల పరిధిలోని రైతులు అక్కడకు వెళ్ళడం లేదు. నిర్వహణ లేకపోవడంతో రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

మండలంలో వ్యవసాయశాఖ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో అ శాఖ అధికారులు రైతువేదికలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో మహిళా ఉద్యోగులతోపాటు మహిళ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వేదికల వద్ద మౌలిక వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Feb 28 , 2025 | 12:09 AM