Share News

రైతులకు పరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:54 PM

మండలంలోని 8 గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షం రైతులకు భారీ నష్టం వాటిల్లిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం దెబ్బతిన్న పంటలను పరి శీలించారు.

 రైతులకు పరిహారం చెల్లించాలి

ఓదెల ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని 8 గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షం రైతులకు భారీ నష్టం వాటిల్లిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం దెబ్బతిన్న పంటలను పరి శీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అధికంగా రైతులు సీడ్‌ పంటలను కోల్పోవడంతో నష్టం వచ్చిందని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో వివిధ సీడ్‌ కంపెనీల ఆర్గనైజర్లు చెల్లించినట్లు, ఇక్కడ కూడా ఎక రానికి రూ,50 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పంట చేతికి అందే సమయంలో గింజ మొత్తం నేలరా లిందన్నారు. ఓదెల మండలంలో దాదాపు 450 ఎకరా ల్లో పంటలు దెబ్బతిన్నాయని, వెంటనే ఓదెల, జూలపల్లి మండలాల రైతులకు పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. దాత రాకేష్‌, పుల్లూరి పృథ్వి, ఎర్రవెల్లి అనిల్‌, భూషనవేని సత్యం, కొండపాక నరసింహ చారి, పులి కొమురయ్య, సాయికృష్ణ, రవీందర్‌, భిక్షపతి తో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:54 PM