Share News

కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల వివాదం

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:32 AM

కాల నీతోపాటు సింగరేణి గనులపై ఏర్పాటు చేసిన ఫెక్సీలు కాంగ్రెస్‌ పార్టీలో వివాదానికి దారితీశాయి. కాలనీలోని పలు కూడళ్ళతోపాటు ఆర్జీ-2 ఏరియాలోని గనులపై ఎంపీ గడ్డం వంశీకృష్ణతోపాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి.

కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల వివాదం

యైుటింక్లయిన్‌కాలనీ, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): కాల నీతోపాటు సింగరేణి గనులపై ఏర్పాటు చేసిన ఫెక్సీలు కాంగ్రెస్‌ పార్టీలో వివాదానికి దారితీశాయి. కాలనీలోని పలు కూడళ్ళతోపాటు ఆర్జీ-2 ఏరియాలోని గనులపై ఎంపీ గడ్డం వంశీకృష్ణతోపాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. సింగరేణి రిటైర్డ్‌ కార్మికుల సంఘం పేరిట వెలిసిన ఫ్లెక్సీల్లో మంత్రి శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ ఫొటోలు పెట్టలేదు. సోమవారం రాత్రి ఫ్లెక్సీలను గమనించిన కాలనీ, వెంకట్రావ్‌పల్లె గ్రామ శాఖ నాయ కులు ఫ్లెక్సీలను తొలగించారు. ఎంపీ అనుచరుడిగా ఉన్న మాజీ కార్పొరేటర్‌ ఫ్లెక్సీలను పెట్టించినట్టు గుర్తిం చిన కాంగ్రెస్‌ నాయకులు సదరు నాయకుడిని ప్రశ్నిం చినట్టు సమాచారం. అంబేద్కర్‌ జయంతిని సందర్భం గా పట్టణ కమిటీకి సమాచారం ఇవ్వకుండా ఎంపీతో కార్యక్రమం నిర్వహించడంపై స్థానిక నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు పెట్టడంపై రాష్ట్ర కమిటీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Updated Date - Apr 23 , 2025 | 12:32 AM