ఉత్పత్తి వివరాలు వెల్లడించిన జీఎంలు
ABN , Publish Date - Mar 01 , 2025 | 11:57 PM
ఆర్‌జీ-1లో ఫిబ్రవరిలో 110శాతం ఉత్పత్తి సాధించినట్టు ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ శనివారం ఒక ప్రక టనలో తెలిపారు. 3.84లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాని గాను 4.22 లక్షల టన్నులు సాధించామని తెలిపారు. ఉద్యోగులు, అధికారులు కలిసి కట్టుగా రక్షణతో పని చేసి ఉత్పత్తి సాధించినందునకు జీఎం అభినందిం చారు.
గోదావరిఖని, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఆర్‌జీ-1లో ఫిబ్రవరిలో 110శాతం ఉత్పత్తి సాధించినట్టు ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ శనివారం ఒక ప్రక టనలో తెలిపారు. 3.84లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాని గాను 4.22 లక్షల టన్నులు సాధించామని తెలిపారు. ఉద్యోగులు, అధికారులు కలిసి కట్టుగా రక్షణతో పని చేసి ఉత్పత్తి సాధించినందునకు జీఎం అభినందిం చారు. అదే విధంగా వార్షిక ఉత్పత్తి లక్ష్యం 44.92లక్షల టన్నులకు గాను 42.21లక్షల టన్నులతో 94శాతం ఉత్పత్తి సాధించామని జీఎం వివరిం చారు. సింగరేణి సీఎండీ మార్గదర్శకాలతో ఈ నెల 19న జీడీకే 11ఇంక్లైన్ 2800టన్నుల రోజు వారీ బొగ్గు ఉత్పత్తి లక్యానికి గాను రికార్డు స్థాయిలో 5600టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా సింగరేణి కాలనీలలో ఉద్యోగుల నివాసాలకు తాగు నీటి సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నందున ఉద్యోగులు సహకరించి నీటిని పొదుపుగా వాడు కోవాలన్నారు.
ఆర్జీ-2 ఉత్పత్తి 99 శాతం
యైుటింక్లయిన్‌కాలనీ, (ఆంధ్రజ్యోతి): ఆర్జీ-2 ఏరియా 99 శాతం ఉత్పత్తి సాధించినట్టు జీఎం బండి వెంకటయ్య పేర్కొన్నారు. శనివారం జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలను తెలిపారు. డివిజన్ టార్గెట్ 10.47 లక్షల టన్నులు కాగా 10.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగినట్టు తెలిపారు. ఓసీపీ-3 టార్గెట్ 10.20 లక్షల టన్నులు కాగా 10.22 లక్షల టన్నులతో వంద శాతం ఉత్పత్తి జరిగిందని వెంక టయ్య పేర్కొన్నారు. వీకేపీ లక్ష్యం 27,700 టన్నులకు 12,198 టన్నులు సాధించి 44ు ఉత్పత్తి సాధించామని జీఎం తెలిపారు. ఏరియా నుండి 7.39 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్టు తెలిపారు. మెరుగైన పనితీరు కనబర్చిన ఓసీపీ-3 ఉద్యోగులను అభినందిస్తున్నట్టు జీఎం తెలిపారు. ఏరియా ఇంజనీర్ నరరసింహారావు, ఎస్వోటూ జీఎం రాముడు, డీజీఎం పర్సనల్ అనిల్‌కుమార్, అధికారులు ఎర్రన్న, మురళీకృష్ణ, ధనుంజయ, వెంకట రామచంద్రలు పాల్గొన్నారు.
ఆర్జీ-3 ఉత్పత్తి 104, ఏపిఏ ఉత్పత్తి 66శాతం
రామగిరి, (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపిఏ డివిజన్‌ల ఉత్పత్తి వివరాలను జీఎంలు సుధాకర్‌రావు, నాగేశ్వర్‌రావులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆర్జీ-3 డివిజన్ పరిధిలో ఫిబ్రవరి లో ఏరి యాకు నిర్థేశించిన 5.44 లక్షల టన్నులకు గాను 5.64 లక్షల టన్నులు సాధించి 104 శాతంలో నిలిచాయని పేర్కొన్నారు. ఏపీఏ డివిజన్‌కు నిర్ధేశించిన 0.18 లక్షల టన్నులకుగాను 0.12లక్షల టన్నులు 66 శాతం ఉత్పత్తిని సాదించినట్లు పేర్కొన్నారు. ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసిపి-1 ప్రాజెక్టుకు నిర్ధేశించిన 2.74 లక్షల టన్నులకు గాను 2.93 లక్షల టన్నులు సాధించి 107 శాతంలో నిలిచిందన్నారు. ఓసిపి-2 ప్రాజెక్టు నిర్థేశించిన 2.70లక్షల టన్నులకు గాను 2.70 లక్షలు సాధించి వందశాతం లక్ష్యాలను సాధించిందన్నారు.