న్యాయవాదుల నిరసన
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:10 AM
గోదావరి ఖనికి చెందిన న్యాయవాది కిరణ్‌జీపై వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో మూడు కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనం తరం అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన తెలిపారు.
కోల్‌సిటీ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): గోదావరి ఖనికి చెందిన న్యాయవాది కిరణ్‌జీపై వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో మూడు కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనం తరం అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షురా లు చందాల శైలజ మాట్లాడుతూ సీఐ న్యాయ వాది పట్ల దురుసుగా ప్రవర్తించడం గర్హనీయ మని, క్షమాపణ చెప్పాలన్నారు. ఐలూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఉమర్, పట్టణాధ్యక్షుడు ఆసంపల్లి రవీందర్, రాంటెంకి శ్రీనివాస్, షాహ నావజ్, శ్రీలత, రేష్మా, శీతకారి చంద్రశేఖర్, పులిపాక రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి సంఘీభావం తెలి పారు. బాలుడిని అదుపులోకి తీసుకున్న విషయమై మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాది పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. నాయవాదులు సత్యనారాయ ణరెడ్డి, మురళీధర్‌యాదవ్, రాకం దామోదర్, మహేష్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తి పాల్గొన్నారు.