ఎన్టీపీసీ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:36 PM
ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యాలు ప్రభావిత ప్రాంత అభి వృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. సోమవారం ఈడీసీ మిలీనియం హాలులో అధికారులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
జ్యోతినగర్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యాలు ప్రభావిత ప్రాంత అభి వృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. సోమవారం ఈడీసీ మిలీనియం హాలులో అధికారులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిశ్రమలకు ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజలు సుమారు 73 వేల ఎకరాల భూమిని ధరాదత్తం చేశారని, వేలాది మంది ఉపాధిని కోల్పో యారన్నారు. ఎన్టీపీసీ కోసం భూమిని త్యాగం చేసిన ప్రతి భూనిర్వాసితుడికి సంస్థలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో పని చేస్తున్న ఉద్యో గులు, కాంట్రాక్టు కార్మికులు కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని, మెరుగైన వైద్యం అందేలా యాజమాన్యం చూడాలన్నారు. కాలుష్యం బారిన పడ కుండా చుట్టు పక్కల ప్రాంతాలలో మొక్కలు నాటా లన్నారు. ప్రభావిత గ్రామాలు, డివిజన్లలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రాజీవ్ రహ దారిలోని సర్వీస్ రోడ్డును పూర్తి చేయాలన్నారు. ఆర్ ఎఫ్‌సీఎల్ ప్రభావిత ప్రాంత ప్రజలు తమ సమస్య లను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజ మాన్యం వీర్నపల్లి గ్రామాన్ని తరలించాలన్నారు. ఎల్క లపల్లి గేట్లను తొలగించి ఆ ప్రాంత ప్రజలకు సరైన రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలన్నారు. సూపర్ స్పెషల్ ఆసుపత్రి, పశు వైద్యశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్‌ఆర్) విజయ్ కుమార్ సిక్దర్, ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారి సోమనాథ్, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ ఈశ్వర్, ప్రజలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.