Share News

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

ABN , Publish Date - Feb 28 , 2025 | 12:12 AM

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగిందని కమిషనర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం జెడ్‌పీ హై స్కూల్‌, గోదావరిఖని సెక్రర్డ్‌ హార్ట్‌ హై స్కూల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

కోల్‌సిటీ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగిందని కమిషనర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం జెడ్‌పీ హై స్కూల్‌, గోదావరిఖని సెక్రర్డ్‌ హార్ట్‌ హై స్కూల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పోలీస్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 163బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ అమలు చేశామని, పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్నారు.

ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు మొత్తం 560మంది బందోబస్తులో పాల్గొన్నారన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత బ్యాలెట్‌ బాక్స్‌లను కరీంనగర్‌లోని రెసిప్షన్‌ సెంటర్‌కు భారీ బందోబస్తు మధ్య చేరవేస్తున్నామన్నారు. కమిషనర్‌ వెంట అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) రాజు, ఎస్‌బీ ఏసీపీ రాజు, గోదావరిఖని ఏసీపీ రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2025 | 12:12 AM