భూభారతి చట్టంతో రైతులకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:55 PM
భూమి సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం లక్ష్మిప్రసన్న ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణ యంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొ న్నారు.
ఓదెల ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): భూమి సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం లక్ష్మిప్రసన్న ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణ యంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొ న్నారు. గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదన్నారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికా ర్డులు భూ భారతి చట్టంలో కొనసాగుతాయని తెలి పారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ దర ఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి, కలె క్టర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా పరిష్కారానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళసుమన్‌రెడ్డి, ఏఎంసీ మార్కెట్ కమిటీ సభ్యులతో పాటు తహసీల్దార్, మండల ప్రజలు పాల్గొన్నారు.
ఐకేపీ కేంద్రాలను తనిఖీ
వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాలతోపాటు ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన 24 గంటల్లోగా మిల్లులకు తరలించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతీ కొనుగొలు కేంద్రంలో ప్యాడి క్లీనర్లు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో జనరల్ వార్డు, ల్యాబ్స్, వ్యాక్సిన్ విభాగా లను పరిశీలించారు. ఆసుపత్రికి ఔట్ పేషేంట్లు వస్తున్న వారి సంఖ్య, వివరా లు, ఆరోగ్య పరీక్షల వివరాలతోపాటు డయాగ్నొస్టిక్ వాహనం వివరాలు, డాక్టర్ షహబాజ్ ఖాన్‌ను తెలుసుకున్నారు. సింగిల్‌విండో చైర్మన్ ఆళ్ళ సుమన్‌రెడ్డి పాల్గొన్నారు.
ముత్తారం, (ఆంధ్రజ్యోతి): భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహిం చిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం భూ సమస్యల పరి ష్కారానికి కీలకమైందని, దీనిపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. పక్కగా భూ సరిహద్దులు నిర్ణ యిస్తారని, రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయసాయం అందుబాటులో ఉంటుందన్నారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ జరిపి రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత గడువు 30 రోజులలోగా మ్యూటేషన్ జరుగుతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరి పి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. భవి ష్యత్తులో భూమికి భూదార్ కార్డు అందిస్తామన్నారు. పెండింగ్ సాదాబైనా మాల పరిష్కారానికి భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. రెవె న్యూ డివిజన్ అధికారి సురేష్, తహసీల్దార్ మధుసూ దన్‌రెడ్డి, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.