Share News

సోనియా, రాహుల్‌పై కేసులు పెట్టడంపై నిరసన

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:31 PM

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ గురువారం గోదా వరిఖని చౌరస్తాలో కాంగ్రెస్‌ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

సోనియా, రాహుల్‌పై కేసులు పెట్టడంపై నిరసన

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ గురువారం గోదా వరిఖని చౌరస్తాలో కాంగ్రెస్‌ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పట్టణ కాంగ్రెస్‌ అఽధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్‌ నగర అఽధ్యక్షుడు బొంతల రాజేష్‌ హాజరై మాట్లాడారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో ఈడీ సోనియా, రాహుల్‌గాంధీ పేర్లను చేర్చడం దారుణమన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత కాంగ్రెస్‌ నాయకులపై ఈడీ దాడులు కొనసాగుతున్నా యని, బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజలు గమ నిస్తున్నారన్నారు. సామాజిక దృక్పథంతో జవహర్‌లాల్‌నెహ్రు పత్రికను స్థాపించారని, ఆర్థిక ఇబ్బందులతో పత్రికను మూసివేసి నప్పటికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షాలు సోనియా, రాహుల్‌లపై కక్ష సాధింపు చర్య లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిం చారు. కాంగ్రెస్‌ నాయకులు కాల్వ లింగ స్వామి, మాద రబోయిన రవికుమార్‌, సుజాత, మల్లయ్య, ముస్తాఫా, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్‌, దీటి బాలరాజు, పాతపెల్లి ఎల్లయ్య, జాలి రాజమణి, పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:31 PM