Share News

కటింగ్‌ లేకుండా ధాన్యం కొనుగోలు

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:27 PM

గింజ కటింగ్‌ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు. శనివారం వ్యవసాయ మార్కెట్‌ ఆవరణతోపాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

కటింగ్‌ లేకుండా ధాన్యం కొనుగోలు

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) గింజ కటింగ్‌ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు. శనివారం వ్యవసాయ మార్కెట్‌ ఆవరణతోపాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లకు 1,234 కోట్ల రూపాయల బోనస్‌ చెల్లిస్తే పెద్దపల్లి నియోజక వర్గంలో 59 కోట్ల 63 లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలి పారు. రాష్ట్రంలో అత్యధికంగా సన్నవడ్లు పండించి ఎక్కువ బోనస్‌ పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు దక్కిందన్నారు. యాసంగిలో కూడా సన్నవడ్లకు 5 వందల రూపాయల బోనస్‌ చెల్లిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారన్నారు. క్విం టాల్‌ సీడ్‌ ధాన్యానికి రూ.2 వేల నుం చి 5 వేల వరకు ఎక్కు వ ధర యాజమాన్యాలు చెల్లిస్తున్నార న్నారు. సీడ్‌ సాగు చేసిన రైతుల పంటలు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతింటే ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం చెల్లిస్తామని సీడ్‌ కంపెనీల యాజమాన్యాలు రైతు లకు బాండ్‌ పేపర్లు రాసిచ్చా రన్నారు. రైతులకు మేలు చేస్తుంటే ఓర్వలేకనే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలకు తెరలేపారని ఆరోపిం చారు. రైతులు కొనుగోలు కేంద్రా లను సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప, వైస్‌చైర్మన్‌ కూర మల్లారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్లు నర్సింహ రెడ్డి, సంపత్‌, విండో కార్యదర్శులు మధు, గడ్డి తిరుపతి, డైరెక్టర్లు, అధికారులు, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తి, నాయ కులు రాజేందర్‌, నూగిల్ల మల్లయ్య, అరే సంతోష్‌, ప్రదీప్‌, సుమన్‌ రెడ్డి, శ్రీనివాస్‌, మహేందర్‌, పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:27 PM