Share News

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సుకు ఎంపిక

ABN , Publish Date - Feb 27 , 2025 | 12:12 AM

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సుకు జిల్లా సైన్స్‌ అధికారి, కన్నాల ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బి. రవినందన్‌ రావు ఎంపికైనట్లు డీఈవో మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఎస్‌సీఈఆర్‌టీలో నిర్వహించే వైజ్ఞానిక సదస్సుకు హాజరుకావాలని డీఎస్‌వోకు ఆహ్వానం అందినట్లు తెలిపారు.

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సుకు ఎంపిక

పెద్దపల్లి కల్చరల్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సుకు జిల్లా సైన్స్‌ అధికారి, కన్నాల ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బి. రవినందన్‌ రావు ఎంపికైనట్లు డీఈవో మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఎస్‌సీఈఆర్‌టీలో నిర్వహించే వైజ్ఞానిక సదస్సుకు హాజరుకావాలని డీఎస్‌వోకు ఆహ్వానం అందినట్లు తెలిపారు. సైన్స్‌ ఇన్‌ అవర్‌ వరల్డ్‌ ప్రధాన ఇతివృత్తంతో ఈ ఏడాది సదస్సు జరుగుతుండగా విజ్ఞాన శాస్త్ర విద్యలో ప్రమాణాలు పెంచేందుకు శాస్త్రీయ ప్రమాణాలు అనే ఉప అంశంలో డీఎస్‌వో తన పరిశోధనా పత్రంను సమర్పించనున్నారు. జిల్లాలో వరుసగా రెండేళ్ళుపాటు నిర్వహించిన సంచార ప్రయోగశాల ద్వారా జరిగిన కృత్యాధార బోధనలోని పలు అంశాల ఆధారంగా రూపొందించినట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉన్నత పాఠశాలల నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ ఒక్కరే సదస్సుకు ఎంపికయ్యారు. సమగ్ర శిక్ష సమన్వయకర్తలు పిఎం షేక్‌, సీహెచ్‌ మల్లేష్‌ గౌడ్‌, కవిత, హెచ్‌ఎం కమలాకర్‌ రావు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు అభినందనలు తెలిపారు. డీఎస్‌వో వెంట జిల్లా నుంచి కె జగదీశ్వర్‌రెడ్డి, రజిత, కృష్ణమోహనమూర్తి, దేవేందర్‌లు పాల్గొననున్నారు.

Updated Date - Feb 27 , 2025 | 12:12 AM