Share News

Big Shock: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు..

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:00 AM

కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పండుగపూట బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. కరీంనగర్ వన్ టౌన్ పీఎస్‌లో ఈ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డివో, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏల ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352, 292 కింద కేసులు నమోదు అయ్యాయి.

Big Shock: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు..

కరీంనగర్: బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy)కి పండుగపూట బిగ్ షాక్ (Big Shock) తగిలింది. ఆయనపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. కరీంనగర్ వన్ టౌన్ పీఎస్‌లో ఈ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డివో, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏల ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352,292 కింద కేసులు నమోదు అయ్యాయి. మరో ఫిర్యాదు ఆధారంగా 126 (2),115(2) పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ (MLA Sanjay) కొట్టుకున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌ మైక్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్‌ను ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలని సవాల్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. వాగ్వాదం కాస్తా ముదిరి ఇద్దరూ ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. మంత్రుల ఎదుటే కొట్టుకున్నారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. వివాదం నేపథ్యంలో అక్కడంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా, బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడడం ఏంటని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి..

కైట్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి


జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. సంజయ్‌ను నువ్వు ఏ పార్టీ అని అడిగితే కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారన్నారు. అలా అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి చూపించాలని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ పెట్టిన భిక్ష వల్ల నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావని.. అలాంటిది ఆయనపైనే విమర్శలు చేస్తున్నావు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావన్నారు. తాము కచ్చితంగా నిలదీస్తామని.. అడుగడుగునా అడ్డుకుంటామని తెలిపారు.


కాగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను అడ్డుకుని దాడి చేయడంపై కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పేదవానికి మేలు జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఏ మాత్రం బాగోలేదని మండిపడ్డారు. పోలీసులు అదుపు చేసిన ఆగకపోవడం దారుణమని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప.గో. జిల్లా: సంక్రాంతి కోడి పందాలకు సర్వం సిద్ధం

సూర్యాపేట: సైకో భర్తను హతమార్చిన భార్యలు

నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 13 , 2025 | 11:00 AM