Share News

షీటీంపై అవగాహన

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:27 AM

ఎన్టీపీసీలోని కేంద్రీయ విద్యాల యం విద్యార్థులకు మంగళవారం కమిషనరేట్‌ షీటీం సిబ్బంది అవగాహన కల్పించారు. షీ టీం ఇన్‌చార్జి ఎస్‌ఐ లావణ్య మాట్లాడు తూ విద్యార్థినులు, మహిళల భద్రత కోసమే షీ టీంలను ఏర్పాటు చేశారని, అన్ని కళాశాలలు, విద్యా సంస్థల వద్ద, ప్రధానమైన కూడళ్లలలో షీ టీం నిత్యం ఉంటా యన్నారు.

షీటీంపై అవగాహన

జ్యోతినగర్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్ర జ్యోతి): ఎన్టీపీసీలోని కేంద్రీయ విద్యాల యం విద్యార్థులకు మంగళవారం కమిషనరేట్‌ షీటీం సిబ్బంది అవగాహన కల్పించారు. షీ టీం ఇన్‌చార్జి ఎస్‌ఐ లావణ్య మాట్లాడు తూ విద్యార్థినులు, మహిళల భద్రత కోసమే షీ టీంలను ఏర్పాటు చేశారని, అన్ని కళాశాలలు, విద్యా సంస్థల వద్ద, ప్రధానమైన కూడళ్లలలో షీ టీం నిత్యం ఉంటా యన్నారు. విద్యార్థులను ఎవరైన లైంగిక వేధింపులకు గురి చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామ న్నారు. లోన్‌ యాప్‌లు, మొబైల్‌ ఫోన్లలో వచ్చే ఫేక్‌ కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండా లని, ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నెంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థు లు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరా రు. కార్యక్రమంలో షీ టీం సభ్యులు స్నేహలత, సురేష్‌, మౌనిక, కేవీ ప్రిన్సిపాల్‌ శోభన్‌బాబు, ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:27 AM