ఇసుక తరలించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు ఖాళీ
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:10 AM
మహా శివరాత్రి సందర్భంగా గోదావరినదిలో పుణ్య స్నానాలు చేయటానికి వచ్చిన భక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. బుధ వారం గోదావరినది తీరాన్ని పుట్ట మధు పరిశీ లించి భక్తులతో మాట్లా డారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక తర లించేందుకే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు ఆపడం లేదన్నారు.

మంథని, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి సందర్భంగా గోదావరినదిలో పుణ్య స్నానాలు చేయటానికి వచ్చిన భక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. బుధ వారం గోదావరినది తీరాన్ని పుట్ట మధు పరిశీ లించి భక్తులతో మాట్లా డారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక తర లించేందుకే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు ఆపడం లేదన్నారు. నీళ్ళు లేకుండా చేసి ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించాలన్నదే వాళ్ళ ఉద్దేశమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావా లనే మేడిగడ్డ బ్యారేజీని నిర్వీర్యం చేస్తుందన్నారు. 14 నెలలుగా బ్యారేజీ పై దుష్ప్రచారం చేసి నీళ్ళు ఆపడం లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో ఒక్క పిల్లర్ కుంగితే పైన ఉన్న అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కావా లనే నీళ్ళు ఆపడం లేదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహించే మంథనిలో భక్తుల పుణ్య స్నానాలకు నీళ్ళు నిలపకపోవడం, ఏర్పాట్లు చేయకపోవడం విచారకరమన్నారు. తాను ఎమ్మె ల్యేగా ఉన్న సమయంలో గోదావరినదిలో నీళ్ళు లేకుంటే గుండారం రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. ప్రాజెక్టులో నీళ్ళు నిలపకుండా రైతులను, భక్తులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నేత ఏగోళపు శంకర్‌గౌడ్ ఉన్నారు.