Share News

భూ భారతి చట్టంపై విస్తృత ప్రచారం చేయాలి

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:35 PM

భూ భారతి చట్టంపై రైతులు, ప్రజలలో విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురు వారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో నిర్వహించిన అవగాహన కార్య క్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

భూ భారతి చట్టంపై విస్తృత ప్రచారం చేయాలి

జ్యోతినగర్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): భూ భారతి చట్టంపై రైతులు, ప్రజలలో విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురు వారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో నిర్వహించిన అవగాహన కార్య క్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. భూ భారతి(రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌) చట్టం 2025 పై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు ఈనెల 28 వరకు సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. అధికారులు అందించిన ఆర్డర్లపై భూ భారతి చట్టం ప్రకారం అప్పీలు చేసు కునే అవకాశముందని, రెవెన్యూ అధికారి నిర్ణయంపై కలెక్టర్‌, కలెక్టర్‌ నిర్ణ యంపై ట్రిబ్యునల్‌ వద్ద అప్పీలు చేసుకోవచ్చన్నారు.

గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్‌ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, ప్రస్తుతం ఆ అవసరం లేకుండా అప్పీల్‌కు అవకాశం కల్పించార న్నారు. సివిల్‌ కోర్టుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు అవసర మైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారిని నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆధార్‌ కార్డు లాగానే భూమికి భూధార్‌ సంఖ్యను కేటాయిస్తారని, దీంతో భూ ఆక్రమణలకు చెక్‌ పడుతుందన్నారు. కొత్త చట్టంపై అ వగాహన కల్పించడంలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేశామని, ఏదైనా సమస్యలుంటే అధికారులు సిద్ధంగా ఉంటారని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న రికార్డులు భూ భారతిలో కొన సాగుతాయన్నారు. సమావేశంలో రెవెన్యూ డివిజన్‌ అధికారి గంగయ్య, రామగుండం తహసీల్దార్‌ ఈశ్వర్‌, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:35 PM