BRS: రేవంత్ మూలాలు ఆర్‌ఎస్‌ఎస్‌లోనే : కవిత
ABN , Publish Date - Jan 13 , 2025 | 04:42 AM
సీఎం రేవంత్‌రెడ్డి మూలాలు ఆర్‌ఎ్‌సఎ్‌సలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
సుభా్‌షనగర్/బాన్సువాడ, జనవరి 12(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి మూలాలు ఆర్‌ఎ్‌సఎ్‌సలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగపూర్‌లో తబ్లిఖ్ ఏ ఇజ్తెమా ఏర్పాట్లను కలిసి ఆమె ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. ఆర్‌ఎ్‌సఎస్ మూలాలు ఉన్న రేవంత్‌రెడ్డి మైనారిటీల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
వారికిచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని విమర్శించారు. కన్నతల్లి లాంటి బీఆర్‌ఎస్ పార్టీని వదిలి మాజీ స్పీకర్, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఎందుకు ద్రోహం చేశారని నిలదీశారు. స్వతంత్ర భారతదేశంలో ఏ నియోజకవర్గానికి మంజూరు కానీ నిధులను బాన్సువాడకు కేసీఆర్ విడుదల చేశారని ఆమె తెలిపారు.