Kingfisher Beers: మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్.. కింగ్‌ఫిషర్ ఈజ్ బ్యాక్
ABN , Publish Date - Jan 20 , 2025 | 06:03 PM
Telangana: కొన్నాళ్ల కింద రాష్ట్రంలోని మందుబాబులకు కింగ్‌ఫిషర్ కంపెనీ చేదువార్త చెప్పింది. బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు షాక్ ఇచ్చింది. అయితే తాజాగా లిక్కర్ లవర్స్‌కు ఆ సంస్థ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది.

తెలంగాణలోని లిక్కర్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. రాష్ట్రంలో మళ్లీ కింగ్‌ఫిషర్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తెలంగాణలో కింగ్‌ఫిషర్‌తో పాటు హెన్‌కిన్ బీర్ల సరఫరాను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు వాటిని తయారు చేసే యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)తో చర్చలు జరిపాక ఈ డెసిషన్ తీసుకున్నామని పేర్కొంది.
దూసుకెళ్లిన షేర్ ధర!
బీర్ల ధరల పెంపు, సకాలంలో బకాయిల చెల్లింపులు తదిరత అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చల అనంతరం వాటి సరఫరా మీద సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది యునైటెడ్ బ్రేవరీస్. తమ డిమాండ్ల మీద త్వరలోనే డెసిషన్ తీసుకుంటామని గవర్నమెంట్ తెలపడంతో కస్టమర్లు, కార్మికులను దృష్టిలో ఉంచుకొని వెనక్కి తగ్గామని స్పష్టం చేసింది. సర్కారు హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నామని యునైటెడ్ బ్రేవరీస్ చెప్పుకొచ్చింది. కాగా, బీర్ల తయారీపై ప్రకటనతో ఆ సంస్థ షేర్ ధర ఒక్కసారిగా దూసుకెళ్లింది. అప్పర్ సర్క్యూట్‌ను తాకడం విశేషం.
ఇవీ చదవండి:
మనోజ్‌కు షాకిచ్చిన తిరుపతి హాస్టల్ యజమానులు
ఆ జిల్లాను వణికిస్తున్న చిరుత పులులు
కేసీఆర్‌పై కాళేశ్వరం కమిషన్ ఫోకస్
మరిన్ని తెలంగాణ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి