Share News

KTR: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:21 AM

రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు.

KTR: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

  • త్వరలో నల్లగొండలో రైతు ధర్నా చేపడతాం : కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ తప్పుడు నిర్ణయాలతో పాటు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంవల్లే అన్నదాతలు ప్రాణం తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాలపై అక్రమకేసులు బనాయించడం, అరెస్టులు చేసే తాపత్రయం సీఎం రేవంత్‌రెడ్డిదని ఆరోపించారు. సీఎం ప్రాధాన్యం ఫార్ములా కేసైతే, తమ ప్రాధాన్యత ఫార్మర్‌లని తెలిపారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా నల్లగొండలో రైతుధర్నా నిర్వహిస్తామని చెప్పారు. రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ అధ్యయన కమిటీ ఛైర్మన్‌ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు కమిటీ ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్‌ బ్యాంకులో రైతు ఆత్మహత్య ఘటనే అధ్యయన కమిటీ వేయడానికి కారణమని, రైతు సంక్షేమ కోసమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. ఈనెల 24న పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా నుంచి అధ్యయనం ప్రారంభిస్తామన్నారు.


మాజీ ఎమ్మెల్యేకే రక్షణలేదు: కేటీఆర్‌

దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని కేటీఆర్‌ ఆరోపించారు. పోలీసుల ముందే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై మంత్రి అనుచరులు దాడిచేయడం తగదని బుధవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. దాడికి గురైన వ్యక్తిని అరెస్టుచేసి.. దాడి చేసినవారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని డీజీపీని కేటీఆర్‌ కోరారు.


ఇవి కూడా చదవండి..

BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్

Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’

Updated Date - Jan 23 , 2025 | 04:21 AM