Share News

KTR: మూసీమూటల వేట, లగచర్ల లడాయిని ఎదుర్కొన్నాం..

ABN , Publish Date - Jan 03 , 2025 | 03:46 AM

కాంగ్రెస్‌ పార్టీ మూసీలో మూటలవేట నుంచి లగచర్ల లడాయి వరకూ అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన గట్టిగా నిలబడి ఎదుర్కొన్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు.

KTR: మూసీమూటల వేట, లగచర్ల లడాయిని ఎదుర్కొన్నాం..

  • అవినీతి కాంగ్రె్‌సను గద్దెదించేదాకా పోరాడదాం

  • గులాబీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు

హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ మూసీలో మూటలవేట నుంచి లగచర్ల లడాయి వరకూ అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన గట్టిగా నిలబడి ఎదుర్కొన్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. గతేడాది కాంగ్రెస్‌ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులు పోరాట స్ఫూర్తిని కనబరిచారని.. హామీల ఎగవేత, మోసపూరిత చర్యలను అడ్డుకోగలిగామన్నారు. ప్రభుత్వం తీరుపై మన పోరాటాన్ని ఇలాగే కొనసాగిద్దాం... నిరసనలు చేపడుతూనే రానున్న రోజుల్లో మోసపూరిత కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ తోబుట్టువుల్లారా.. అంటూ గురువారం ‘ఎక్స్‌’వేదికగా పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ సందేశం పంపారు. బీఆర్‌ఎస్‌ పోరాటం వల్లే అదానీ ఆశజూపిన రూ.100కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందని, లగచర్ల లడాయి.. యావత్‌దేశం ముందు నియంతృత్వ కాంగ్రె్‌సను దోషిగా నిలబెట్టిందన్నారు.


పదేళ్ల తెలంగాణ ప్రగతిలో ఫూలే దంపతుల స్ఫూర్తి: కేసీఆర్‌

తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ల సామాజిక ప్రగతి ప్రస్థానంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయిఫూలే దంపతుల స్ఫూర్తి ఇమిడి ఉందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం సావిత్రీబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని మహిళా సాధికారత, వారి విద్య కోసం ఆ దంపతులు చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజల జీవన విధానంలో గుణాత్మక మార్పు, వారి హక్కులు కాపాడటం కోసం త్యాగాలు చేసిన భారతీయ మహనీయుల్లో మహాత్మా ఫూలే దంపతులు ముందు వరుసలో ఉంటారని కేసీఆర్‌ కొనియాడారు.

21.jpg

Updated Date - Jan 03 , 2025 | 03:46 AM