Share News

Gajjela Kantam: కేటీఆర్‌ తీహార్‌ జైలుకు వెళ్లక తప్పదు..

ABN , Publish Date - Jan 11 , 2025 | 08:05 AM

అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల సొమ్ము దోచుకున్న కేటీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు తీహార్‌ జైలుకు వెళ్లక తప్పదని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెల కాంతం(Gajjela Kantam) అన్నారు.

Gajjela Kantam: కేటీఆర్‌ తీహార్‌ జైలుకు వెళ్లక తప్పదు..

- ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్‌ కాంతం

హైదరాబాద్: అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల సొమ్ము దోచుకున్న కేటీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు తీహార్‌ జైలుకు వెళ్లక తప్పదని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెల కాంతం(Gajjela Kantam) అన్నారు. బంజారాహిల్స్‌ లోని ఓ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ కుటుంబంపై ఆయన మండిపడ్డారు. కుటుంబ పాలనతో తెలంగాణ(Telangana)ను అన్ని విధాలుగా దోచుకున్నారని, ఎన్నికల కోడ్‌ ఉండగా క్యాబినెట్‌ ఆమోదం లేకుండా ఫార్ములా ఈ రేస్‌లో రూ.55 కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కోళ్ల దాణా పేరుతో అల్ర్పాజోలమ్‌ దందా


అవినీతి కేసుల్లో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు జైలుకు వెళ్తున్నారని, అయినప్పటికీ సానుభూతి కోసం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ముగిసిన తర్వాత తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధమని కేటీఆర్‌(KTR) ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.


city4.2.jpg

తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, అప్పుడు కేటీఆర్‌ ఎందుకు చేయలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌(Telangana sentiment)తో మరోసారి లబ్ధిపొందేందుకు బీఆర్‌ఎస్‌(BRS) ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం చేసిన అవినీతిని ప్రజల ముందు ఉంచేందుకు ఈనెల 29న ఇందిరాపార్క్‌ వద్ద సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2025 | 08:05 AM