Share News

KTR: అవ్వా .. ఎట్లున్నవ్.. బాగున్నావా..

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:13 PM

అవ్వా .. ఎట్లున్నవ్.. బాగున్నావా.. అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఓ అమ్మను ఆప్యాయంగా పలకరించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నగరంలోని ఓల్డుబోయినపల్లి డివిజన్‌లో కేటీఆర్ పర్యటించారు.

KTR: అవ్వా .. ఎట్లున్నవ్.. బాగున్నావా..

- వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన కేటీఆర్‌

హైదరాబాద్: ఓల్డుబోయినపల్లి డివిజన్‌లో ఇఫ్తార్‌ విందులో పాల్గొనేందుకు వచ్చిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(BRD Working President KTR) 20 నిమిషాల పాటు కార్పొరేటర్‌ ముద్దం నర్సింహ్మ యాదవ్‌(Corporator Muddam Narasimha Yadav) కుటుంబ సభ్యులతో గడిపాడు. వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగి వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి తనకు ఇష్టమైన కాఫీ పెట్టించుకుని తాగారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబడ్దార్‌..


city4.jpg

ఫొటోలు దిగుతున్న సమయంలో ముద్దం నర్సింహ్మ యాదవ్‌ తల్లిని ఆలింగనం చేసుకుని అవ్వా బాగున్నావా... ముద్దం అన్న నిన్ను బాగా చూసుకుంటున్నాడా... లేకుంటే చెప్పు మా ఇంటికి తీసుకెళ్తా అని ఆమెతో ఆప్యాయంగా అన్నారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ పరంగా కాకుండా కేటీఆర్‌ ఆప్యాయతను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబడ్దార్‌..

Minister: మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

Harish Rao Big Relief: హరీష్‌రావుకు భారీ ఊరట.. కేసు కొట్టివేత

Updated Date - Mar 20 , 2025 | 12:13 PM