Share News

Jagadeesh Reddy: దొంగ ఫైళ్లు పెట్టించి కేటీఆర్‌ను ఇరికించే కుట్ర

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:03 AM

కక్షపూరితంగా కేటీఆర్‌పై పెట్టిన కేసులో బలం లేదని బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌రెడ్డి అన్నారు. ఏసీబీ అధికారులను కేటీఆర్‌ ఇంటికి పంపించి.. వారి ద్వారా దొంగ ఫైళ్లను పెట్టించి.. ఎలాగైనా ఆయన్ను కేసులో ఇరికించాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

Jagadeesh Reddy: దొంగ ఫైళ్లు పెట్టించి కేటీఆర్‌ను ఇరికించే కుట్ర

  • రేవంత్‌ యత్నం బెడిసికొట్టింది: జగదీశ్‌రెడ్డి

  • సర్కారును ప్రశ్నిస్తున్నందుకే కేసు: వేముల

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కక్షపూరితంగా కేటీఆర్‌పై పెట్టిన కేసులో బలం లేదని బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌రెడ్డి అన్నారు. ఏసీబీ అధికారులను కేటీఆర్‌ ఇంటికి పంపించి.. వారి ద్వారా దొంగ ఫైళ్లను పెట్టించి.. ఎలాగైనా ఆయన్ను కేసులో ఇరికించాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ ఇంటిపై ఏబీసీ సోదాలు చేసి ఏవో ఫైళ్లు దొరికాయని లేనిది ఉన్నట్లు భ్రమింపచేయాలన్న ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘కేటీఆర్‌పై పనికిమాలిన చెత్త కేసు పెట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం చిల్లర ప్రయత్నాలు చేస్తోంది. ‘రాజ్యాంగం పట్ల గౌరవంతో కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీని ఉసిగొల్పి.. డ్రామా చేయాలనుకున్న రేవంత్‌రెడ్డి ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో ఎన్నికల బాండ్ల విషయాన్ని కొత్తగా కనిపెట్టినట్లుగా సీఎం మీడియాకు లీకులు ఇచ్చారు.


ఇందులో కొత్తేముంది..?’ అని ప్రశ్నించారు. ఏసీబీ నుంచి కాకుండా మీడియా సంస్థలకు సీఎం ఆఫీసు నుంచే లీకులిచ్చారని ఆరోపించారు. ‘మీ పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తే.. నీ పేరు చెప్పకుంటే.. జైల్లో పెడతావా? రేవంత్‌రెడ్డి.. అసలు నువ్వు రాష్ట్రానికి గుర్తుండిపోయేలా ఏమైనా చేస్తేకదా.. నీ పేరు గుర్తుండేది’ అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఫార్ములా-ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలని ప్రభుత్వం కోరుకుంటే కేటీఆర్‌ వెంట న్యాయవాదిని అనుమతించాలని, లేదంటే కోర్టు అనుమతితో కేటీఆర్‌ విచారణకు హాజరవుతారని చెప్పారు. ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించి ఏసీబీ కేసుపై కేటీఆర్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉండగానే.. ఆయనకు ఏసీబీ నోటీసు ఎందుకు ఇచ్చారనిమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారిప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. దృష్టి మళ్లించేందుకే జనంలో కేటీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Updated Date - Jan 07 , 2025 | 05:03 AM