Share News

Hyderabad: తప్పిన ప్రాణాపాయం.. అయినవారు లేకున్నా అండగా నిలిచిన పోలీసులు

ABN , Publish Date - Feb 26 , 2025 | 08:21 AM

రోడ్డు ప్రమాదం(Road accident)లో భారీగా రక్తాన్ని కోల్పోయి సృహ తప్పి పడిపోయిన వ్యక్తిని రక్షకభటులు అక్కున చేర్చుకుని అండగా నిలిచి ప్రాణాలను నిలబెట్టారు. సోమవారం మధ్యాహ్నం నిజాంపేట(Nizampet)లోని హైటెన్షన్‌ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దినసరి కూలీగా పనిచేస్తున్న జట్టా గంగయ్య (44)కు తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad: తప్పిన ప్రాణాపాయం.. అయినవారు లేకున్నా అండగా నిలిచిన పోలీసులు

- సకాలంలో ఆస్పత్రికి చేరిన క్షతగాత్రుడు

- నిజాంపేట రోడ్డు ప్రమాదంలో కోలుకున్న దినసరికూలి

హైదరాబాద్‌ సిటీ: రోడ్డు ప్రమాదం(Road accident)లో భారీగా రక్తాన్ని కోల్పోయి సృహ తప్పి పడిపోయిన వ్యక్తిని రక్షకభటులు అక్కున చేర్చుకుని అండగా నిలిచి ప్రాణాలను నిలబెట్టారు. సోమవారం మధ్యాహ్నం నిజాంపేట(Nizampet)లోని హైటెన్షన్‌ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దినసరి కూలీగా పనిచేస్తున్న జట్టా గంగయ్య (44)కు తీవ్ర గాయాలయ్యాయి. భారీగా రక్తం పోవడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతన్ని కేపీహెచ్‌బీ పోలీస్‌ కానిస్టేబుళ్లు జి.మహేష్‌ (పీసీ-3832), జి.దశరథ (3590)లు చికిత్స కోసం నిజాంపేటలోని శ్రీశ్రీ హోలిస్టిక్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించేందుకు ఆస్పత్రి వైద్యుల బృందం తీవ్రంగా శ్రమించింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: జూపార్క్‌ సందర్శన మరింత ప్రియం.. పెరిగిన ధరలు


క్రిటికల్‌ కేర్‌ వైద్యుల బృందం చైతన్య స్రవంతి, సూర్యకిరణ్‌ ఇందుకూరి,శుభ, సూర్యతేజ రుద్రారపులు తీవ్రంగా శ్రమించి అపస్మారక స్థితిలోకి వెల్లిన జట్టా గంగయ్యకు మళ్లీ ప్రాణం పోశారు. ప్రమాదంతో తీవ్ర రక్తస్రావం కావడంతో గంగయ్యకు రక్తం ఎక్కించాల్సి వచ్చింది. దీని కోసం కానిస్టేబుళ్లు ఇద్దరు జి.మహేష్‌, జి.దశరథలు బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి రక్తం సేకరించి రోగికి అందించడంతో వైద్యులు అతనికి మెరుగైన చికిత్సను వేగంగా అందించారు. ప్రస్తుతం గంగయ్య కోలుకుంటున్నాడు.


ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్‌?

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2025 | 08:21 AM