Share News

Secunderabad: ఆదర్శ రైల్వేస్టేషన్‌గా మల్కాజిగిరి..

ABN , Publish Date - Jan 10 , 2025 | 09:55 AM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station)కు కూతవేటు దూరంలో ఉన్న మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌(Malkajgiri Railway Station) అభివృద్ధితో రూపురేఖలు మారనున్నాయి. అమ్రిత్‌ భారత్‌ స్టేషన్‌ సికింద్రాబాద్‌స్కీంలో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు సంబందించి నిర్మాణాలు చకచక జరిగిపోతున్నాయి.

Secunderabad: ఆదర్శ రైల్వేస్టేషన్‌గా మల్కాజిగిరి..

- అమ్రిత్‌భారత్‌ స్టేషన్‌ స్కీంలో భాగంగా అభివృద్ధి పనులు

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station)కు కూతవేటు దూరంలో ఉన్న మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌(Malkajgiri Railway Station) అభివృద్ధితో రూపురేఖలు మారనున్నాయి. అమ్రిత్‌ భారత్‌ స్టేషన్‌ సికింద్రాబాద్‌స్కీంలో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు సంబందించి నిర్మాణాలు చకచక జరిగిపోతున్నాయి. స్టేషన్‌లో ఇప్పటికే 12 మీటర్ల వెడల్పుతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, మూడు లిప్టులు, మూడు ఎస్కలేటర్లు, నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Sankranti: పతంగుల మాటున ప్రమాదాలు జరిగే అవకాశం..


ఇంద్వేల్‌ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. స్టేషన్‌కు సరిపడా హై లెవల్‌ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. వీఐపీ లాంజ్‌, ఏసీ వేయిటింగ్‌ హాల్‌, విశాలమైన పార్కింగ్‌ సదుపాయాలు, కొత్తగా రైల్వేస్టేషన్‌ రాకపోకలకు గాను అప్రోచ్‌రోడ్డు, స్టేషన్‌కు రెండు వైపులా ఆకర్షనీయంగా పోర్టికోల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.


city7.2.jpg

పచ్చిక బయళ్లతో కూడిన గార్డెన్లతో పాటు ఐ లవ్‌ యూ మల్కాజిగిరి(I love you Malkajgiri) అనే సెల్ఫీ పాయింట్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌ రూపురేఖలు పూర్తిగా మారి మినీ ఏయిర్‌పోర్టుగా ప్రయాణికుల మన్ననలు పొందనుంది. కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సైతం మల్కాజిగిరిలో స్టాప్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్‌’ యాప్‌

ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?

ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2025 | 09:55 AM