Manoj vs Vishnu: విష్ణుపై ఆసక్తికర ట్వీట్ చేసిన మనోజ్..
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:40 PM
Manchu Family Disputes: మంచు ఫ్యామిలీ మధ్య ఘర్షణలు తగ్గనున్నాయా.. వివాదాలకు పరిష్కారం వెతికేందుకు మంచు మనోజ్ ఒక అడుగు ముందుకేశారా.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇంట్రస్ట్ పెంచుతోంది. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

హైదరాబాద్, జనవరి 18: మంచు కుటుంబంలో వివాదాల ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటీకే కేసుల పరంపరం కొనసాగుతుండగా.. తాజాగా మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. వివాదానికి ఎండ్ కార్డ్ వేసేలా ఈ ట్వీట్ ఉంది. చర్చలకు అన్న విష్ణును ఆహ్వానిస్తూ మనోజ్ ట్వీట్ చేశాడు. ‘రండి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నేను ఒక్కడినే వస్తాను. ఏ ప్లేస్‌కైనా వస్తాను. ఎవరినో అడ్డం పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాన్నని, మహిళ, సిబ్బందిని అడ్డం పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. మన వద్ద ఉన్న సమస్యకు ఒక పరిష్కారం తీసుకొని వద్దాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందాం.’ అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.
ఇక శుక్రవారం నాడు ఒక ట్వీట్ చేసిన మనోజ్.. అందులో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు మాదిరిగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్’ అని పోస్ట్ చేసిన మనోజ్.. ఆ పోస్టుకు విష్ణును ట్యాగ్ చేశాడు.
ఎంబీయూ ఘటనపై పరస్పర ఫిర్యాదులు..
తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని మోహన్‌బాబు విశ్వవిద్యాలయం (ఎంబీయూ) వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నటుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనికరెడ్డి ఈనెల 15న శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు వెళ్లకూడదని పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి డెయిరీ ఫామ్ వద్ద ఉన్న తన తాత, నానమ్మల సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనోజ్ దౌర్జన్యంగా అక్కడున్న సిబ్బందిని బూతులు తిడుతూ, రాళ్లతో దాడి చేసి, లోపలికి ప్రవేశించారని మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మనోజ్, మౌనికారెడ్డి, వారి అనుచరులు పళణిరాయల్, పవన్, మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా తన భార్యతో కలసి సంక్రాంతి పండుగకు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థ వద్దకు వస్తే ఎంబీయూ సిబ్బంది విజయసింహా, సురేంద్ర, బాలాజీ, సారథి, కిరణ్, రవిశేఖర్, హేమాద్రి, జీఎం చంద్రశేఖర్, కేవీఎస్ మణి, మరి కొంతమంది అడ్డుకుని తమపై దౌర్జన్యం చేశారని మనోజ్ ఫిర్యాదు చేశారు. మనోజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read:
నాగసాధువుగా మారడం ఎలా.. రూల్స్ ఏంటి..
ఇలా చేస్తే.. సొంతూళ్లోనే నెలకి రూ.50 వేలు సంపాదించొచ్చు..
తెలంగాణలో.. ప్రతి మహిళకు రూ.15.50 లక్షలు
For More Telangana News and Telugu News..