Manchu Manoj: నన్ను భయపెట్టలేరు.. మంచు మనోజ్ సంచలనం..
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:31 PM
తిరుపతి ఘటన తరువాత మరోసారి మంచు మనోజ్ స్పందించారు. తన తండ్రి మోహన్ బాబును ఉద్దేశించి సంచలన వీడియో రిలీజ్ చేశారు. తాను చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకు ..

హైదరాబాద్, ఫిబ్రవరి 18: మంచు ఫ్యామిలీలో గొడవలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్నారనుకుంటే.. ఇప్పుడు మళ్లీ రచ్చకెక్కారు. తాజాగా మంచు మనోజ్ మీడియాకు సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన తండ్రి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. అంతేకాదు.. బోగస్ కేసులు పెట్టించి, దాడులు చేయిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకీ మళ్లీ వివాదం ఎందుకు రగిలింది.. మనోజ్ ఏం వీడియో విడుదల చేశారు.. అందులో ఎలాంటి ఆరోపణలు చేశారు.. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
తిరుపతి ఘటన తరువాత మరోసారి మంచు మనోజ్ స్పందించారు. తన తండ్రి మోహన్ బాబును ఉద్దేశించి సంచలన వీడియో రిలీజ్ చేశారు. తాను చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకు నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేయాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తానేదో భయపడుతున్నానని అనుకుంటున్నారేమోనని.. ఈ జన్మలో అది జరగదన్నారు. తన మీద, తన భార్య భూమా మౌనిక మీద ఇప్పటి వరకు 32 కేసులు పెట్టారని.. ఇంకా ఎన్ని కేసులు పెట్టిస్తారో కూడా తెలియదన్నారు మనోజ్.
ఢిల్లీ , హైదరాబాద్, తిరుపతిలో కోట్లు రూపాయలు ఇచ్చి వారి మనుషులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని మనోజ్ తన తండ్రిపై ఆరోపణలు గుప్పించారు. కలెక్టర్ ఆఫీసుల్లో ఫిర్యాదు చేశారని.. బోగస్ కేసులు అనేక పెట్టారన్నారు. బౌన్సర్లతో స్టూడెంట్స్‌పై దాడి చేయిస్తున్నారని మనోజ్ ఆరోపించారు. సోమవారం రాత్రి తాను రిసార్ట్స్‌లో రాబోయే సినిమా గురించి డిస్కషన్ చేస్తుంటే.. పోలీసులు వచ్చి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇంత మంది ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ పోలీసులు తమను ఇబ్బందిపెట్టారన్నారు. దీంతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మాట్లాడుదామని.. తానే స్వయంగా పీఎస్‌కు వెళ్లినట్లు మనోజ్ చెప్పారు. పీఎస్‌లో సీసీ కెమెరా ఎదురుగా మాట్లాడానని.. తమను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించానన్నారు. సోమవారం రాత్రి తన విషయంలో జరిగిన ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని మనోజ్ తెలిపారు. తన వద్దనున్న ఆధారాలను ఎస్పీకి అందజేస్తానన్నారు.
Also Read:
వైరల్ ఆడియోపై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్‌పై టీడీపీ నేతలు ఫైర్
సచివాలయ ఉద్యోగాలపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఈ స్పీడ్‌ను చూసి మిక్సీ కంపెనీలు కూడా భయపడతాయేమో..
For More Telangana News and Telugu News..