Home » Manchu mohanbabu
CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని మంచు మోహన్‌బాబు, విష్ణు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మోహన్‌బాబు, విష్ణు రేవంత్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తిరుపతి ఘటన తరువాత మరోసారి మంచు మనోజ్ స్పందించారు. తన తండ్రి మోహన్ బాబును ఉద్దేశించి సంచలన వీడియో రిలీజ్ చేశారు. తాను చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకు ..
Manchu Family: మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. మనోజ్ తనతో పాటు కీలక డాక్యుమెంట్లను తీసుకొచ్చారు. వీరిద్దరిని సబ్ కలెక్టర్ విచారించనున్నారు.
Manchu Manoj: ‘‘మాకు ఏ సమస్యలు లేవు... ఒకవేళ ఉన్నా వాటిని మోహన్ బాబు, మంచు విష్ణుతో చెప్పుకుంటాం.. వారు మా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారు. మోహన్ బాబు స్థాపించిన విద్యాసంస్థల వల్లే ఈ పాత్రంలో భూముల అభివృద్ధి జరిగింది. పండుగ రోజు మీరు విశ్వవిద్యాలయాల గేటును తన్నటం చూసి ఆశ్చర్యపోయాం’’ అంటూ మనోజ్‌కు తిరుపతి హాస్టల్ యజమానులు లేఖ రాశారు.
Mohan Babu: మంచు ఫ్యామిలీలో రోజుకో ట్విస్ట్ బయటపడుతూనే ఉంది. తాజాగా ఆస్తులకు సంబంధించి మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు మంచు మోహన్‌బాబు. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలంటూ జిల్లా మెజిస్ట్రేట్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Manchu Manoj: నిన్నటి పరిణామాలపై హీరో మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని.. డీఎస్పీతో చర్చిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు తనకు అందకపోవడం, కోర్టు ఉత్తర్వులు జిరాక్స్ కాపీ పోలీసుల దగ్గర ఉండడంపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా తర్వాత పంపుతానని మంచు మనోజ్ చెబుతున్నారు.
జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు మోహన్ బాబుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసు శాఖను సుప్రీం కోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: సినీనటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌పై విచారణ జరుగుతోందని, ఆ విచారణ ముగిసేంతవరకు మోహన్‌బాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు మంచు మోహన్ బాబు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మెహన్ బాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.
సినిమా నటులు అల్లు అర్జున్, మంచు మోహన్ బాబు ఘటనలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. మహిళలు ,పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు.