Share News

Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

ABN , Publish Date - Apr 01 , 2025 | 10:33 AM

Ponnam Prabhakar Farmers: రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
Ponnam Prabhakar Farmers

సిద్దిపేట, ఏప్రిల్ 1: జిల్లాలోని హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సేర్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఈరోజు (మంగళవారం) ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో మొదటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పోతారంలో ప్రారంభించుకున్నామన్నారు. పచ్చివడ్ల పేరుతో పంటల వద్ద అమ్ముకునే ప్రయత్నం చేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొస్తే మద్దతు ధర వస్తుందని తెలిపారు. తూకంలో మోసం లేకుండా, డబ్బుల పేమెంట్ విషయంలో కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘గతంలో ఓ ఆసామి మా గ్రామంలో ధాన్యం కొనుగోలు చేసుకుని పోయాడు డబ్బులు ఇవ్వలేదని నా దగ్గరికి వచ్చారు. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వమే మీ దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తుంది ’ అని వెల్లడించారు.


రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగించేలా నిర్ణయం తీసుకుంటుందన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామన్నారు. అగ్రికల్చరల్ పనిముట్లు మండల సమైక్యాల ద్వారా ఇచ్చి రైతులకు ఉపయోగపడేలా చేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లు, సమైక్య సంఘాల ద్వారా 600 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే గ్రామాల్లో జరుగుతుందని.. అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వస్తామని తెలిపారు. ఫేస్ -1, ఫేస్ -2 కింద ఇల్లు మొత్తం లేనివారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా గ్రామంలో నిర్ణయం తీసుకోవాలన్నారు.

HCU Land Politics:హెచ్‌సీయూ భూముల వివాదంపై రాజకీయ రగడ


ఈరోజు నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు, ఉద్యోగులకు, మహిళలకు సంక్షేమ పథకాలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోయేలా ప్రభుత్వాన్ని అక్కా చెల్లెళ్లు ఆశీర్వదించాలని కోరారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు త్వరగా పూర్తిచేసి పంటలకు నీళ్లు అందిస్తామని... రైతులకు ఇబ్బంది అయినా అందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Forbidden Google Searches: గూగుల్‌లో వీటిని అస్సలు వెతకొద్దు.. చిక్కుల్లో పడతారు


Crime News: హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 10:35 AM