Share News

Minister: ఔషధ నియంత్రణ వ్యవస్థ మరింత బలోపేతం

ABN , Publish Date - Jan 02 , 2025 | 07:44 AM

రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక నివేదికను ఆ శాఖ డైరక్టర్‌ జనరల్‌ కమల్‌హాసన్‌రెడ్డి(Kamal Haasan Reddy)తో కలిసి ఆవిష్కరించారు.

Minister: ఔషధ నియంత్రణ వ్యవస్థ మరింత బలోపేతం

  • మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక నివేదికను ఆ శాఖ డైరక్టర్‌ జనరల్‌ కమల్‌హాసన్‌రెడ్డి(Kamal Haasan Reddy)తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో నిషేధిత, నకిలీ మందులపై, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై, ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణ(Telangana)లో డ్రగ్స్‌ రాకెట్స్‌ నడుపుతోన్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపామని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పోలీసు కానిస్టేబుల్‌ ఆత్మహత్య


2024 ఏడాదిలో మొత్తం 573 కేసులను నమోదు చేశామన్నారు. 2023లో కేవలం 56 కేసులే నమోదు అయినట్లు గుర్తు చేశారు. నకిలీ మందులు తయారీ చేసి, సరఫరా చేసే వారిపై కఠినంగా వ్యవహరించి అక్రమార్కులపై కేసులు నమోదు చేసిన డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌ అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. కార్యక్రమంలో జాయింట్‌ డైరెక్టర్‌ రాందాన్‌, డిప్యూటీ డైరెక్టర్‌లు రాజవర్ధన చారి, పి.సరళ, డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్లు గోవిందసింగ్‌ నాయక్‌, అనిల్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్‌.. శామీర్‌పేటకు మెట్రో!

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2025 | 07:44 AM