Share News

Yadadri: ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:01 PM

యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11: 36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేశారు.

Yadadri: ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి 9Sri Lakshminarasimha Swamy temple) క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం (Golden Vimana Gopuram) ప్రారంభోత్సవం (Inauguration)ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11: 36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేశారు. దేశంలోనే అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కింది. అంతకుముందు యదాద్రి ఉత్తర రాజగోపురం నుండి ప్రధాన ఆలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రవేశించారు. వారికి ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తర్వాత స్వర్ణ దివ్య విమాన గోపురం వద్దకు సీఎం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి..

ఈ వార్త కూడా చదవండి..

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

The video is not available or it's processing - Please check back later.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజలింగమూర్తి హత్య కేసుపై వీడిన సస్పెన్స్

ఎర్రన్నాయుడు తిరుగులేని నాయకుడు: సీఎం చంద్రబాబు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 23 , 2025 | 12:01 PM