Nizamabad: పసుపు మార్కెట్ యార్డు సెక్యూటిరీ అధికారిపై దాడి.. పరిస్థితి ఎలా ఉందంటే..
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:47 PM
నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డు సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు చేయడంపై పెద్దఎత్తున ధర్మా చేపట్టారు.

నిజామాబాద్: పసుపు మార్కెట్ యార్డులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యార్డుకు చెందిన సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికులు దాడి చేశారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ శ్రీనివాస్‌పై కార్మికులు మండిపడ్డారు. ఈ మేరకు వివిధ సంఘాలకు చెందిన పసుపు కార్మికులు యార్డు ఛైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించారు. దొంగతనం ఆరోపణలపై ఛైర్మన్‌ను ప్రశ్నించారు. కార్మికులంతా పెద్దఎత్తున ధర్నా చేపట్టడంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన యార్డుకు చేరుకున్నారు. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌ను పోలీసులు అక్కడ్నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
అయితే పెద్దఎత్తున గుమిగూడిన కార్మికులు పోలీసుల వాహనాన్ని అడ్డగించారు. కారులోని శ్రీనివాస్‌పై దాడి చేసేందుకు యత్నించారు. అతన్ని బయటకు లాగి కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు తమ కారును అక్కడ్నుంచి వేగంగా పోనిచ్చారు. కార్మికుల ధర్నాతో అక్కడంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ధర్నా నేపథ్యంలో పసుపు క్రయవిక్రయాలు ఆగిపోయాయి. పసుపు కాంటాలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగొళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ యార్డును పోలీసులు భారీగా మోహరించారు.
ఇవి కూడా చదవండి..
జైల్లో వల్లభనేని వంశీ చిందులు.. పోలీసులు సీరియస్.. ఏం చేశారంటే..
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
Read Latest Telangana News And Telugu News