Share News

USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి..

ABN , Publish Date - Mar 17 , 2025 | 10:45 AM

USA: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలో జరిగిన ఈ విషాదకర ఘటనలో ముగ్గురు తెలుగువారు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో..

USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి..
US Road Accident

USA Road Accident : అమెరికాలో సోమవారం ( మార్చి 17 ) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లి వాసులైన ప్రగతిరెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)లు అప్పటికప్పుడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదం నుంచి ప్రగతి రెడ్డి చిన్న కుమారుడు, భర్త రోహిత్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం.


రోహిత్ రెడ్డి కుటుంబం ప్రయాణిస్తున్న కారును ట్రక్కును ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. తమ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబసభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. తమ గ్రామవాసులు జీవితం ఇలా విషాదకరంగా ముగియడంతో టేకులపల్లిలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, 15 సంవత్సరాల క్రితమే అమెరికాకు వలస వెళ్లినట్లు వారి బంధువులు చెబుతున్నారు.


Read Also : KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్

Revanth Reddy: బీజేపీ ఎంపీ డీకే అరుణకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. పోలీసులకు ఆదేశం

CM Revanth Reddy: తాగుబోతోడు జాతిపితా?

Updated Date - Mar 17 , 2025 | 11:05 AM