Share News

TG NEWS: అలా చేస్తే కఠిన చర్యలు.. వారికి రవాణాశాఖ అధికారుల వార్నింగ్..

ABN , Publish Date - Jan 10 , 2025 | 10:29 AM

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో ప్రైవేట్ ట్రావెల్స్ రవాణా చార్జీల వసూళ్లకు పాల్పడుతున్నాయి. అధిక మొత్తంలో రవాణా చార్జీల వసూళ్లకు పాల్పడుతున్న వారిపై అధికారులు ఫోకస్ పెట్టారు.

TG NEWS: అలా చేస్తే కఠిన చర్యలు.. వారికి రవాణాశాఖ అధికారుల వార్నింగ్..

రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో ప్రైవేట్ ట్రావెల్స్ రవాణా చార్జీల వసూళ్లకు పాల్పడుతున్నాయి. అధిక మొత్తంలో రవాణా చార్జీల వసూళ్లకు పాల్పడుతున్న వారిపై అధికారులు ఫోకస్ పెట్టారు. అలాగే సరిగా ఫిటెనెస్ లేని బస్సులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ తొండుపల్లి వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారుల బృందం కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ట్రావెల్స్ బస్సుల తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పర్మిట్, తెలంగాణ రాష్ట్ర ట్యాక్స్, ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలిచారు. సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూల్ చేస్తున్న ట్రావెల్స్ మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇంకా అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అదనపు రవాణా చార్జీలు వసూలు చేయరాదని.. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Sankranti festival: చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

Bandi Sanjay: ఆరోగ్యశ్రీ, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయండి

High Court: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 10 , 2025 | 10:55 AM