Share News

TG NEWS: వికారాబాద్ జిల్లాలో దారుణం.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jan 06 , 2025 | 10:14 AM

TELANGANA: వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వాస్పత్రి వైద్యుడి నిర్లక్ష్యంతో శిశువు మృతిచెందింది. శిశువు మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని బంధవులు ఆరోపిస్తున్నారు. డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళన చేపట్టారు.

TG NEWS: వికారాబాద్ జిల్లాలో దారుణం.. ఏం జరిగిందంటే..

వికారాబాద్ జిల్లా: వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతిచెందింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. డిప్యూటీ డాక్టర్ అశోక్ కుమార్‌ నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ అశోక్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. బంధువులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంధువులకు నచ్చజెప్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నవజాత శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు నవాబ్‌పేట మండలం మాదిరెడ్డిపల్లికి చెందిన భిక్షపతి -స్వప్నల మొదటి సంతానం మగబిడ్డ మృతిచెందింది. రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో ప్రసవం జరగ్గా శిశువు ఆరోగ్యంగా ఉంది. కానీ నిన్న(ఆదివారం) రాత్రి ఎక్కిళ్లు వచ్చాయి. కానీ ఆస్పత్రి రూంలో నుంచి డిప్యూటీ డాక్టర్ అశోక్ కుమార్ బయటకు రాలేదు. ఎంత పిలిచినా డాక్టర్ బయటకు రాకపోవడంతోనే మా బిడ్డ మృతిచెందాడని తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి ఎక్కిళ్లు ఎక్కువ అవడంతోనే మా బిడ్ల మృతిచెందిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు ఆవేదనను చూసిన బంధవులు కన్నీరు పెట్టుకున్నారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు చేపట్టారు. పోలీసుల అదుపులో డాక్టర్ అశోక్ కుమార్ ఉన్నారు. అ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 06 , 2025 | 10:15 AM