Share News

Sankranti festival: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచొద్దు

ABN , Publish Date - Jan 09 , 2025 | 08:00 AM

సంక్రాంతి పండగ(Sankranti festival) వచ్చిందంటే దేశంలోని అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కళ్లన్నీ హైదరాబాద్‌(Hyderabad) మహానగరంపైనే ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగ సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.

Sankranti festival: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచొద్దు

- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: సంక్రాంతి పండగ(Sankranti festival) వచ్చిందంటే దేశంలోని అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కళ్లన్నీ హైదరాబాద్‌(Hyderabad) మహానగరంపైనే ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగ సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆ రాష్ట్ర ప్రజలతోపాటు తెలంగాణ(Telangana) జిల్లాల వారు కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు వెళ్తారు. దీంతో ప్రతి కాలనీలో తాళం వేసిన ఇళ్లే ఎక్కువగా దర్శనమిస్తాయి. పండగకు ఊరెళ్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: RTC buses: సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పది నిమిషాలకో బస్సు


తీసుకోవాల్సిన జాగ్రత్తలు

- సంక్రాంతికి ఊరెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

- ఇళ్లలో విలువైన వస్తువులు ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి.

- 24/7 సేఫ్టీ, సెక్యూరిటీ కోసం ఇంటి ఆవరణలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

- స్మార్టు ఫోన్‌ ద్వారా మానిటరింగ్‌ చేసుకునే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటే మంచిది.

- ఇంటికి సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టంతోపాటు అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలి.


city3.2.jpg

- పనివారిని ప్రతీరోజు ఇంటి ఆవరణను శుభ్రం చేయమని చెప్పాలి.

- ఇంటి ఆవరణలో కొన్ని లైట్స్‌ వెలిగేలా చూసుకోవాలి.

- పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు బీట్‌ కానిస్టేబుల్‌ ఫోన్‌ నంబర్‌ లేదా ఎస్‌ఐ నంబర్‌ తీసుకోవాలి.

- సమాచారం ఇచ్చిన వారి ఇంటి పరిసరాల్లో పోలీసులు రాత్రిపూట గస్తీ పెంచుతారు

- ఇంటి బయట కార్లు, ద్విచక్రవాహనాలను పార్క్‌చేసి వెళ్లేవారు విలువైన వస్తువులను వాటిల్లో ఉంచొద్దు.


- హ్యాండిల్‌ లాక్‌తోపాటు, వీల్‌లాక్‌ కూడా వేయడం ఉత్తమం.

- ఇంటి పక్కన ఉంటున్న వారు ఊరెళ్లకపోతే ఇంటిని పరిశీలిస్తుండమని చెప్పాలి.

- కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. కమిటీ సభ్యులు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై అనుమానం ఉంటే డయల్‌ 100, సైబరాబాద్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490617444, రాచకొండ వాట్సాప్‌ నంబర్‌ 9490617111కు సమాచారం ఇవ్వండి.


ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2025 | 08:00 AM